అనుమానాస్పద రీతిలో మహిళ మృతి | lady dead mystery | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద రీతిలో మహిళ మృతి

Jul 30 2016 11:17 PM | Updated on Aug 21 2018 7:17 PM

అనుమానాస్పద రీతిలో మహిళ మృతి - Sakshi

అనుమానాస్పద రీతిలో మహిళ మృతి

అనుమానాస్పద రీతిలో ఒక మహిళ మృతి చెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున రాజమహేంద్రవరం దానవాయిపేట ఆంధ్రాబ్యాంక్‌ సమీపంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దానవాయిపేటలో సూర్య హోటల్‌ వెనుక భాగంలో ఉన్న ఇంటిలో చుక్కా అమ్మజమ్మ (55), ఆమె భర్త రాంబాబు రెడ్డి, కుమారులు రామిరెడ్డి, లక్ష్మణ రెడ్డి, శ్రీనివాస రెడ్డి నివాసిస్తున్నారు.

  • సంఘటన స్థలంలో కారంపొడి చల్లిన వైనం 
  • మృతురాలి కుమారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • దానవాయిపేట (రాజమహేంద్రవరం) :

    అనుమానాస్పద రీతిలో ఒక మహిళ మృతి చెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున రాజమహేంద్రవరం దానవాయిపేట ఆంధ్రాబ్యాంక్‌ సమీపంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దానవాయిపేటలో సూర్య హోటల్‌  వెనుక భాగంలో ఉన్న ఇంటిలో చుక్కా అమ్మజమ్మ (55), ఆమె భర్త రాంబాబు రెడ్డి, కుమారులు రామిరెడ్డి, లక్ష్మణ రెడ్డి, శ్రీనివాస రెడ్డి నివాసిస్తున్నారు. రాంబాబు రెడ్డి కొంత కాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమతమయ్యాడు.  శనివారం తెల్లవారు జామున 4.40 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అమ్మజమ్మ నిద్రిస్తున్న గది వద్దకు వెళ్లి తలుపుకొట్టగా ఆమె తలుపు తెరిచింది. వెంటనే అగంతకుడు ఆమె శరీరంలోకి ఇంజక్షన్‌  పొడిచాడు. దాంతో ఆమె కేకలు వేస్తూ అక్కడే నేలపై కుప్పకూలిపోయింది. ఆ కేకలు విన్న కుమారులు అక్కడకు వెళ్లగా నేలపై పడి ఉన్న తల్లి కనిపించింది. వెంటనే ఆమెను వారు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్టు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న సెంట్రల్‌ జోన్‌ డీఎస్పీ కులశేఖర్, ఒకటవ పట్టణ పోలీస్టేçÙన్‌ సీఐ రమణరావు సంఘటనస్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ  ఖాళీ సిరంజ్,  ఆధారాలు దొరక్కుండా కారంపొడి చల్లి ఉండడాన్ని గమనించారు. దాంతో పోలీసులు మృతురాలి కుమారులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చిన్న కుమారుడు శ్రీనివాసరెడ్డి మతి స్థిమితం సరిగా లేదని, అతను హెచ్‌ఐవీ రోగిఅని గుర్తించారు. మిగిలిన ఇద్దరు సోదరులకు కూడా ఈ వ్యాధి ఉన్నట్టు పోలీసుల విచారణలో తెలింది. కేసు నమోదు చేసిన పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement