breaking news
lady dead
-
అనుమానాస్పద రీతిలో మహిళ మృతి
సంఘటన స్థలంలో కారంపొడి చల్లిన వైనం మృతురాలి కుమారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు దానవాయిపేట (రాజమహేంద్రవరం) : అనుమానాస్పద రీతిలో ఒక మహిళ మృతి చెందిన సంఘటన శనివారం తెల్లవారుజామున రాజమహేంద్రవరం దానవాయిపేట ఆంధ్రాబ్యాంక్ సమీపంలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దానవాయిపేటలో సూర్య హోటల్ వెనుక భాగంలో ఉన్న ఇంటిలో చుక్కా అమ్మజమ్మ (55), ఆమె భర్త రాంబాబు రెడ్డి, కుమారులు రామిరెడ్డి, లక్ష్మణ రెడ్డి, శ్రీనివాస రెడ్డి నివాసిస్తున్నారు. రాంబాబు రెడ్డి కొంత కాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమతమయ్యాడు. శనివారం తెల్లవారు జామున 4.40 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి అమ్మజమ్మ నిద్రిస్తున్న గది వద్దకు వెళ్లి తలుపుకొట్టగా ఆమె తలుపు తెరిచింది. వెంటనే అగంతకుడు ఆమె శరీరంలోకి ఇంజక్షన్ పొడిచాడు. దాంతో ఆమె కేకలు వేస్తూ అక్కడే నేలపై కుప్పకూలిపోయింది. ఆ కేకలు విన్న కుమారులు అక్కడకు వెళ్లగా నేలపై పడి ఉన్న తల్లి కనిపించింది. వెంటనే ఆమెను వారు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే ఆమె చనిపోయినట్టు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న సెంట్రల్ జోన్ డీఎస్పీ కులశేఖర్, ఒకటవ పట్టణ పోలీస్టేçÙన్ సీఐ రమణరావు సంఘటనస్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ ఖాళీ సిరంజ్, ఆధారాలు దొరక్కుండా కారంపొడి చల్లి ఉండడాన్ని గమనించారు. దాంతో పోలీసులు మృతురాలి కుమారులను ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. చిన్న కుమారుడు శ్రీనివాసరెడ్డి మతి స్థిమితం సరిగా లేదని, అతను హెచ్ఐవీ రోగిఅని గుర్తించారు. మిగిలిన ఇద్దరు సోదరులకు కూడా ఈ వ్యాధి ఉన్నట్టు పోలీసుల విచారణలో తెలింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
డయేరియాతో మహిళ మృతి
లావేరు : మండలంలోని వేణుగోపాలపురం గ్రామంలో గురువారం ఉదయం బాలి పాపమ్మ(50) అనే మహిళ మృతి చెందింది. ఈమె రెండు నెలలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. క్యాన్సర్ వ్యాధితో పాటు బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రంతా వాంతులు, విరేచనాలు ఎక్కువ అయ్యాయి. వాంతులు, విరేచనాలు అయిన ఆమెను గ్రామంలోని ఆర్ఎంపీ వైద్యులు వద్దకు కుటుంబ సభ్యులు తీసుకువెళ్లి వైద్యసేవలు అందజేశారు. వాంతులు విరేచనాలు ఎక్కువ కావడం వల్ల ఆమె డీహైడ్రేషన్‌కు గురై గురువారం ఉదయం ఇంటి వద్ద మృతి చెందింది. మృతురాలికి ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కు అయిన తల్లి డయేరియా వ్యాధితో మరణించడంతో కుమార్తె కన్నీరుమున్నీరుగా విలపించింది. ఇదిలా ఉండగా గ్రామంలో మీసాల మహలక్ష్మీ, అదపాక సూరీ అనే వ్యక్తులతో పాటు పలువురు డయేరియా వ్యాధితో బాధపడుతున్నారు. వీరిని వైద్య సేవల కోసం కొండములగాంలోని కమ్యూనిటి హెల్త్ సెంటర్‌కు తరలించారు. గ్రామాన్ని సందర్శించిన సీహెచ్‌వో వేణుగోపాలపురంలో బాలి పాపమ్మ అనే మహిళ డయేరియాతో మృతి చెందిన విషయం తెలుసుకున్న లావేరు పీహెచ్సీ సీహెచ్‌వో రాజగోపాలరావు గురువారం గ్రామానికి వెళ్లి మృతురాలి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఇంకా ఎవరికైనా డయేరియా వ్యాధితో బాధపడుతున్నారా, ఉంటే వారికి వైద్యసేవలు అందించాలని స్థానిక ఏఎన్ఎంకు సూచించారు. ఏఎన్ఎం బి.అరుణకుమారి, ఆశ కార్యకర్తలు గురువారం గ్రామంలో ఇంటింటికి వెళ్లి డయేరియా వ్యాధితో బాధపడుతున్న రోగులు వివరాలు సేకరించి వైద్యసేవలు అందజేశారు.