మామిడి తోటలు, ఇతర పండ్ల తోట లను విస్తృతంగా పెంచాలని ఉపాధిహామీ పథ కం ద్వారా ప్రభుత్వం జిల్లాకు లక్ష్యాన్ని నిర్ణయించినప్పటికీ ఉద్యానవనాల పెంపకం పట్ల రైతులకు అవగాహన కల్పించడంలో అధికారు లు విఫలం అయ్యారు.
మోర్తాడ్, న్యూస్‌లైన్ : మామిడి తోటలు, ఇతర పండ్ల తోట లను విస్తృతంగా పెంచాలని ఉపాధిహామీ పథ కం ద్వారా ప్రభుత్వం జిల్లాకు లక్ష్యాన్ని నిర్ణయించినప్పటికీ ఉద్యానవనాల పెంపకం పట్ల రైతులకు అవగాహన కల్పించడంలో అధికారు లు విఫలం అయ్యారు. దీంతో అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఉద్యానవనాల పెంపుదల సాగే అవకాశం కనిపించడం లేదు. జిల్లాలోని 36 మండలాల్లో ఉన్న వివిధ గ్రామాల్లో రెండు వేల ఎకరాల్లో ఉద్యానవనాలను అభివృద్ధి చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఇప్పటికే ఉద్యానవనాల పెంపున కు దరఖాస్తులను స్వీకరించి మొక్కల పెంపకానికి ఏర్పాట్లు చేయాలి. అయితే రైతుల నుంచి స్పందనలేక పోవడంతో తక్కువ విస్తీర ్ణంలోనే ఉద్యానవనాల పెంపకం చేపట్టనున్నారు. జిల్లా లో ఇప్పటివరకు కేవలం 700 ఎకరాల్లోనే ఉద్యానవనాలను ఏర్పాటు చేయడానికి రైతులు ముందుకు వచ్చారు. లక్ష్యం రెండు వేల ఎకరా లు ఉండగా కనీసం 50 శాతం లక్ష్యం చేకూరే అవకాశం కనిపించడం లేదు. రైతులు ఎన్ని ఎకరాల్లోనైనా పండ్ల తోటలను పెంచవచ్చు.
ఎలాంటి పరిమిత విస్తీర్ణం లేకుండా వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో పండ్ల మొక్కలను నాటాలని అధికారులు నిర్ణయించారు. మొక్కలు నాట డం, వాటికి నీటిని అందించడానికి డ్రిప్ ఏర్పా టు, మొక్కలను పరిరక్షించడానికి అవసరమైన కూలీలను ఉపాధిహామీ పథకం నుంచి ఏర్పా టు చేస్తారు. ఇతరత్రా ప్రోత్సాహకాలను ఉద్యానవనాల కోసం అందించనున్నారు. రైతు తన కు ఉన్న భూమిని చూపిస్తే ఉద్యానవనాలను ఉపాధిహామీ పథకం ద్వారా అభివృద్ధి చేయ డం జరుగుతుంది. ఉద్యానవనాలను విస్తరించడానికి ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఉపాధిహామీ పథకం ద్వారా పథకాన్ని ప్రారంభించింది. అయితే ఈ పథకం గురించి క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పిం చడం అధికారుల బాధ్యత. ఉద్యానవనాలకు ప్రభుత్వ ఇస్తున్న ప్రోత్సాహాకాలను రైతులకు తెలియచేసి విస్తారంగా పండ్ల తోటలను పెం చాల్సి ఉంది. మార్కెట్‌లో అన్ని రకాల పండ్లకు డిమాండ్ ఏర్పడుతుంది. ఉద్యానవనాలను పెంచిన రైతులకు గిట్టుబాటు అయ్యే అవకాశం ఉంది.
కాగా రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు శ్రద్ధ వహించకపోవడం వల్లే ఉద్యానవనాల పెంపు పట్ల ఎవరూ ఆసక్తిని చూపడం లేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా రు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉద్యానవనాల ఏర్పాటు లక్ష్యానికి అనుగుణంగా సాగేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరు తున్నారు.