విద్యావంతులైతేనే రాణింపు | kuruba meeting in kalluru | Sakshi
Sakshi News home page

విద్యావంతులైతేనే రాణింపు

Nov 4 2016 10:59 PM | Updated on Sep 4 2017 7:11 PM

విద్యావంతులైతేనే రాణింపు

విద్యావంతులైతేనే రాణింపు

సమాజంలో కురుబలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చైతన్యవంతులు కావాలంటే మొదట విద్యావంతులుగా ఎదగాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాగేపరుశురాం అన్నారు.

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ
లేపాక్షి : సమాజంలో కురుబలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చైతన్యవంతులు కావాలంటే మొదట విద్యావంతులుగా ఎదగాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ, కురుబ సంఘం జిల్లా అధ్యక్షుడు రాగేపరుశురాం అన్నారు. లేపాక్షి మండలం కల్లూరులో కురుబ సేవా సంఘం ఆధ్యర్వంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కనకదాసు జయంతి సభలో వారు మాట్లాడారు. 

కురుబలను ఎస్టీ జాబితాలోకి చేర్చుతామని గత ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చి ఇంతరవకు మాట నిలబెట్టుకోలేకపోయారన్నారు. కురుబలకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ముందుగా కల్లూరు బస్టాండు వరకు కురుబలు ర్యాలీ నిర్వహించి శిలాఫలకం ప్రారంభించారు. తాలుకా కురుబ సంఘం అధ్యక్షుడు జగదీష్, స్థానిక కురుబ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్‌, కుళ్లాయప్ప, బిసలమానేపల్లి సర్పంచ్‌ మాళక్క పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement