సెమీస్‌కు కర్నూలు | kurnool to semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌కు కర్నూలు

Dec 16 2016 11:41 PM | Updated on Sep 4 2017 10:53 PM

సెమీస్‌కు కర్నూలు

సెమీస్‌కు కర్నూలు

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో కర్నూలు జిల్లా జట్టు సెమీఫైనల్స్‌కు చేరుకుంది.

హోరాహోరీగా రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలు
 
కర్నూలు (టౌన్‌): రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో కర్నూలు జిల్లా జట్టు సెమీఫైనల్స్‌కు చేరుకుంది. కర్నూలులోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణంలో 62వ రాష్ట్రస్థాయి అండర్‌ 17 బాలబాలికల పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శుక్రవారం క్వార్టర్స్‌ ఫైనల్‌లో కర్నూలు బాలుర జట్టు విశాఖపట్నం జట్టుపై 22–06 తేడాతో గెలిచి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. అలాగే బాలికల మ్యాచ్‌లో కర్నూలు బాలికలపై నెల్లూరు బాలికలు 10–05 తేడాతో గెలుపొంది సెమీఫైనల్‌కు చేరుకున్నారు. మరో క్వార్టర్స్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో కడప జిల్లాపై వెస్టుగోదావరి 13–19 పాయింట్ల తేడాతో గెలుపొంది సెమీస్‌కు చేరుకుంది. మరో బాలికల మ్యాచ్‌లో అనంతపురం జిల్లా జట్టు ప్రకాశం జిల్లా జట్టుపై గెలుపొంది క్వార్టర్స్‌కు చేరుకుంది. స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సెంటర్‌ ఇంచార్జి చెన్నారెడ్డి ఈ మ్యాచ్‌లను పర్యవేక్షించారు. కార్యక్రమంలో జిల్లా స్కూల్‌గేమ్స్‌ సమాఖ్య ఇంచార్జి కార్యదర్శి నరసయ్య, పీఈటీల సంఘం అధ్యక్షులు శ్రీనాథ్, కార్యదర్శి జాకీర్‌హుసేన్, క్రీడల నిర్వహణ కార్యదర్శి డీవీ సుబ్బారెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement