జోడేఘాట్కు వరాలు | ktr made several promises to jodeghat | Sakshi
Sakshi News home page

జోడేఘాట్కు వరాలు

Oct 27 2015 6:52 PM | Updated on Sep 3 2017 11:34 AM

జోడేఘాట్కు వరాలు

జోడేఘాట్కు వరాలు

జోడేఘాట్ గిరిజనులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, వాటర్ గ్రిడ్ ద్వారా మంచినీరు, రోడ్లు తదితర సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.

ఆదిలాబాద్: 'ఇక్కడ నివసిస్తున్న గిరిజనులకు 50 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయిస్తాం.. వాటర్ గ్రిడ్ పైప్ లైన్ ద్వారా మంచినీరు అందిస్తాం.. రోడ్లు వేయిస్తాం.. సమైక్యాంద్ర పాలనలో గిరిజనులకు జరిగిన అన్యాయాన్ని పూడ్చేస్తాం..' అంటూ జోడేఘాట్ పై ఎడతెగని వరాలు కురిపించారు మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్).

 

గోడు వీరుడు కొమరం భీమ్ 75వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన ప్రసంగించారు. సమైక్యాంధ్రలో కొమరం భీమ్ కు సరైన ప్రాధాన్యం లభించలేదని, తెలంగాణ ప్రభుత్వం.. గిరిజనులను అన్నిరకాలుగా ఆదుకుంటుందని పేర్కొన్నారు. మంత్రులు చందూలాల్, జోగురామన్న, ఇంద్రకరణ్ రెడ్డిలతోపాటు పలు శాఖల అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

కెరామెరి మండలంలోని జోడేఘాట్ లో కొమరం భీమ్ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.  కొమురం భీం వర్థంతిలో పాల్గొనేందుకు ఏటా వేలాది గిరిజనులు జోడేఘాట్ వస్తుంటారు. ఇందుకోసం ఈసారి ఉట్నూర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేకంగా బస్‌ సర్వీసులు నడుపుతున్నారు. గత ఏడాది భీం వర్థంతి సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. అప్పుడు ఇచ్చిన హామీల ప్రకారం హట్టినుంచి జోడేఘాట్ వరకు తారు రోడ్డు నిర్మాణం పూర్తికాగా, 81 ఎకరాల్లో భీం స్మారక చిహ్నం, మ్యూజియంలు నిర్మాణ దశలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement