ప్రజలు, రైతులను ఇబ్బందిపెట్టొద్దు | Sakshi
Sakshi News home page

ప్రజలు, రైతులను ఇబ్బందిపెట్టొద్దు

Published Fri, Feb 10 2017 12:40 AM

korukonda temple lands issue

  • వైఎస్సార్‌ సీపీ నేతలు విజయలక్ష్మి, రాజా
  • అన్నవరం భూముల క్రయ, విక్రయాలపై  ఈఓ నిలదీత 
  • రైతులు, ప్రజలతో కలిసి ఆందోళన
  • కోరుకొండ : 
    గత కొన్నేళ్లుగా కోరుకొండ  ప్రజలు, రైతుల స్వాధీనంలో ఉన్న భూములను క్రయ విక్రయాలు చేయకుండా అన్నవరం దేవస్థానం నిలిపివేయడం తగదని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ యూత్‌ రాష్ట్ర ఆధ్యక్షుడు జక్కంపూడి రాజా లు అన్నారు. గురువారం  కోరుకొండ శ్రీలక్షీ్మనరసింహస్వామివారి కల్యాణం ఎర్పాట్లపై సమీక్షకు వచ్చిన అన్నవరం దేవస్థానం ఈఓ కె. నాగేశ్వరరావుకు రైతులు, ప్రజల సమస్య వివరించారు.   స్వామివారికి వివిధ ప్రాంతాల్లో ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నపుడు ఇక్కడి భూముల విక్రయాలు నిలిపివేయడం తగదని నిలదీశారు. ఆడ పిల్ల పెళ్లిళ్లకు ఇండ్లు, పొలాలు కట్నకానుకలుగా ఇచ్చారని, నేడు నిలిచిపోయిన క్రయ విక్రయాల వల్ల కొందరి వివాహాలు నిలిచిపోయాయన్నారు. ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, ఎంపీ మురళీమోహ¯ŒSలు ఈ ఇబ్బందులను పట్టించుకోవడం లేదని వారు అన్నారు. కోరుకొండ  దేవస్థానికి చెందిన రూ.  58 లక్షల  నగదు ఖర్చులపై పూర్తిగా వివరించాలన్నారు. ఈ మేరకు సుమారు గంటకు పైగా ఆందోళన జరిగింది. ఈఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ  అందరికి న్యాయం జరిగేలా సమస్యను ఉన్నతా«ధికారుల దృష్టికి తీసుకెళ్తానని హామీఇచ్చారు. వివిద పార్టీల నాయకులు, రైతులు, ప్రజలు నక్కా రాంబాబు, తాడి హరిశ్చంద్రప్రసాద్‌రెడ్డి. గరగ మధు, తోరాటి శ్రీను, సూరిశెట్టి భద్రం, అడపా శ్రీనివాస్, రొంగల శ్రీనులతో పాటు,  డీఎస్పీ ఏవీఏల్‌ ప్రసన్నకుమార్‌  తదితరులున్నారు. 
     

Advertisement
 
Advertisement
 
Advertisement