బాలుడిని బలిగొన్న నీళ్ల ట్యాంకర్
కావలిరూరల్ : వీధిలో ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిని నీళ్ల ట్యాంకర్ చిదిమేసింది. ఈ సంఘటన కావలి పట్టణంలోని అరుంధతీయపాళెంలో సోమవారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు వీధిలో చిగురుపాటి మధు, వాణి దంపతుల కుమారుడు సందీప్ (3) వీధిలో ఆడుకుంటున్నాడు.
కావలిరూరల్ : వీధిలో ఆడుకుంటున్న మూడేళ్ల బాలుడిని నీళ్ల ట్యాంకర్ చిదిమేసింది. ఈ సంఘటన కావలి పట్టణంలోని అరుంధతీయపాళెంలో సోమవారం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. ఆర్టీసీ బస్టాండ్ వెనుక వైపు వీధిలో చిగురుపాటి మధు, వాణి దంపతుల కుమారుడు సందీప్ (3) వీధిలో ఆడుకుంటున్నాడు.అదే సమయంలో ఓ నీళ్ల ట్యాంకర్ స్థానికులకు నీళ్లు పట్టి వెనుదిరిగి వెళ్తుంది. ఈ క్రమంలో ట్యాంకర్‌ను రివర్స్ చేసుకుంటున్న సమయంలో సందీప్‌పై ట్రాక్టరు వెనుక చక్రం ఎక్కింది. స్థానికులు గమనించి బాలుడిని బయటకు తీశారు. బైక్‌పై ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఎమ్మెల్యే పరామర్శ
చిన్నారి సందీప్ మృతి విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి హుటాహుటిన ఏరియా ఆసుపత్రికి వచ్చారు. చిన్నారి బంధువులతో మాట్లాడి ప్రమాదం ఎలా జరిగింతో అడిగి తెలుసుకున్నారు. చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. ఆయన వెంట డీఆర్‌యూసీసీ సభ్యులు కుందుర్తి కామయ్య, కౌన్సిలర్లు గుడ్లూరు మాల్యాద్రి, మందా శ్రీనివాసులు, వైఎస్సార్‌సీపీ పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పరుసు మాల్యాద్రి, మలిశెట్టి వెంకటేశ్వర్లు, అక్కిలిగుంట మాల్యాద్రి ఉన్నారు.