'మంజునాథ కమిషన్ నివేదక అందిన వెంటనే చర్యలు' | kapu corporation office inaugurated in vijayawada | Sakshi
Sakshi News home page

'మంజునాథ కమిషన్ నివేదక అందిన వెంటనే చర్యలు'

Aug 10 2016 11:22 AM | Updated on Sep 4 2017 8:43 AM

కాపులను బీసీల్లో చేర్చే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని హోంమంత్రి ఎన్ చినరాజప్ప స్పష్టం చేశారు.

విజయవాడ: కాపులను బీసీల్లోచేర్చే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఎన్ చినరాజప్ప స్పష్టం చేశారు. బుధవారం విజయవాడ నగరంలోని సూర్యారావుపేటలో కాపు కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.

అనంతరం చినరాజప్ప మాట్లాడుతూ... జస్టిస్ మంజునాథ కమిషన్ నుంచి నివేదిక అందిన వెంటనే అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామానుజయ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement