తండ్రికి పిండ ప్రదానం చేస్తూ.... | kameswara rao died with cardiac arrest | Sakshi
Sakshi News home page

తండ్రికి పిండ ప్రదానం చేస్తూ....

Aug 14 2016 1:24 PM | Updated on Sep 4 2017 9:17 AM

కృష్ణా పుష్కరాల్లో తండ్రికి పిండ ప్రదానం చేస్తూ ఓ రైల్వే ఉద్యోగి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు.

విజయవాడ: కృష్ణా పుష్కరాల్లో తండ్రికి పిండ ప్రదానం చేస్తూ ఓ రైల్వే ఉద్యోగి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించారు. అయితే అప్పటికే అతడు మరణించాడు. ఈ సంఘటన విజయవాడలోని గొల్లపుడి ఘాట్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. కృష్ణా పుష్కరాల్లో భాగంగా విజయవాడకు చెందిన కామేశ్వరావు (48) ఈ రోజు ఉదయం తండ్రికి పిండ ప్రదానం చేసేందుకు గొల్లపూడి ఘాట్కు వచ్చారు.

తండ్రికి పిండ ప్రదానం చేస్తున్న సమయంలో తీవ్ర గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించారు. అక్కడే ఉన్న పోలీసులు అతడి వద్ద ఉన్న ఐడీ కార్డు ద్వారా రైల్వే ఉద్యోగిగా గుర్తించారు. విజయవాడలోని రైల్వే కోచ్ డిపోలో సీనియర్ సెక్షన్ అదికారిగా కామేశ్వరరావు విధులు నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కామేశ్వరరావు మరణ వార్తను అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 

Advertisement
 
Advertisement
Advertisement