
ముగిసిన ఐటా టోర్నీ
ఉత్కంఠగా సాగిన ఐటా టెన్నిస్ టోర్నీ శుక్రవారం ముగిసింది. జిల్లాకు చెందిన పల్లవి ఫైనల్‌లో తడబడి చందన చేతిలో 9–8 స్కోరు తేడాతో ఓటమి పాలైంది.
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఉత్కంఠగా సాగిన ఐటా టెన్నిస్ టోర్నీ శుక్రవారం ముగిసింది. జిల్లాకు చెందిన పల్లవి ఫైనల్‌లో తడబడి చందన చేతిలో 9–8 స్కోరు తేడాతో ఓటమి పాలైంది. జిల్లాకు చెందిన క్రీడాకారిణి ఫైనల్‌కు చేరడం ఇదే ప్రథమం. టెన్నిస్ టోర్నీకి అనంత క్రీడాగ్రామం వేదిక కావడం పట్ల పలువురు క్రీడ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేశారు. టోర్నీలో గెలుపొందిన విజేతలకు జిల్లా టెన్నిస్ సంఘం అధ్యక్షులు కట్టా నాగభూషణం, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్, నదాల్ టెన్నిస్ స్కూల్ కో–ఆర్డీనేటర్ సిస్కో ట్రోఫీలను అందజేశారు.
విజేతలు వీరే
అండర్–14 సింగిల్స్ బాలికలు
= నైషా శ్రీ వాస్తవ పై లక్ష్మీ సాహితీ 9–1 స్కోరు తేడాతో విజయం సాధించింది.
అండర్–16 సింగిల్స్ బాలికలు
= పల్లవి పై చందన 9–8 స్కోరు తేడాతో విజయం సాధించింది.
అండర్–14 సింగిల్స్ బాలురు
= సుధీర్త్ పై విశాల్‌రెడ్డి 9–4 స్కోరు తేడాతో విజయం సాధించాడు
అండర్–16 సింగిల్స్ బాలురు
= వశిష్ఠ రామ్ పై ఇక్బాల్ మహమ్మద్ ఖాన్ 9–5 తేడాతో విజయం సాధించాడు.
అండర్–16 డబుల్స్ బాలికలు
= పల్లవి, మోనికల పై నైషా శ్రీవాస్తవ, లక్ష్మీ సాహితీ లు 8–2 తేడాతో విజయం సాధించారు.
అండర్–16 డబుల్స్ బాలురు
= ఇక్బాల్ మహమ్మద్ ఖాన్, శశాంక్ లపై వశిష్ఠ రామ్, నితిన్ ప్రణవ్‌లు 8–4 తేడాతో విజయం సాధించారు.