ఇస్రో సేవలు అభినందనీయం
శాస్త్ర, సాంకేతిక అభివృద్ధిలో ఇస్రో సేవలు అభినందనీయమని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు.
ఎస్పీ ఆకె రవికృష్ణ
కర్నూలు : శాస్త్ర, సాంకేతిక అభివృద్ధిలో ఇస్రో సేవలు అభినందనీయమని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. స్పేస్ అవగాహన కార్యక్రమం వాక్‌లో పాల్గొన్న సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలు శనివారం ఉదయం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఎస్పీకి జ్ఞాపికను అందజేశారు. నేడు ప్రజలు వినియోగిస్తున్న సెల్‌ఫోన్లు, టీవీలు, రేడియోలు తదితర టెక్నాలజీ అన్నీ ఇస్రో సేవలేనని ఎస్పీ వారిని అభినందించారు. ఇస్రో సేవలు సామాన్య ప్రజల ముంగిట తేవడం, స్పేస్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. ప్రయోగాల విజయాలతో భవిష్యత్తులో కర్నూలులో మరిన్ని ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సైన్స్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు రాకెట్లు, క్షిపణులు, ఇతర విడి భాగాలపై సమగ్ర అవగాహన పెంచుకోవాలని ఎస్పీ సూచించారు. ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ రబ్బానీ, రాఘవేంద్రరావు, రాఘవకుమార్ తదితరులు ఎస్పీని కలసినవారిలో ఉన్నారు.