పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని ప్రేమజంట ఆత్మహత్య | Inter students suicide | Sakshi
Sakshi News home page

పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని ప్రేమజంట ఆత్మహత్య

Mar 1 2016 9:13 PM | Updated on Nov 6 2018 7:56 PM

పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని ప్రేమజంట ఆత్మహత్య - Sakshi

పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని ప్రేమజంట ఆత్మహత్య

డిచ్‌పల్లి మండలం కమలాపూర్ శివారులో మంగళవారం ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.

డిచ్‌పల్లి (నిజామాబాద్ జిల్లా): డిచ్‌పల్లి మండలం కమలాపూర్ శివారులో మంగళవారం ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మండలంలోని నర్సింగ్‌పూర్ గ్రామానికి చెందిన అజ్జం నర్సయ్య-వినోద కూతురు శిరీష(17), సిరికొండ మండలం రావుట్ల గ్రామానికి చెందిన ఇట్టెంపేట రాజేందర్-లక్ష్మిల పెద్ద కొడుకు సాయిరాం (18)లు ఎనిమిది నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ వేర్వేరు కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. వీరి ప్రేమ విషయం తెలిసిన ఇరువైపు కుటుంబాలవారు చిన్న వయసులోనే పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు పడతారని అడ్డు చెప్పారు. తమ పెళ్లి పెద్దలు అంగీకరించరేమోనని భావించిన ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం బంధువుల పెళ్లి ఉందని రెండు కుటుంబాల వారు డిచ్‌పల్లి మండలం రాంపూర్ గ్రామానికి వెళ్లారు. పరీక్షలు ఉండటంతో శిరీష ఇంటి వద్దనే ఉంది.

బైక్‌పై నర్సింగ్‌పూర్‌కు వచ్చిన సాయిరాం ఎస్సీ కాలనీలో బైక్‌ను పెట్టి, శిరీష ఇంటికి చేరుకున్నాడు. గ్రామస్తులు బైక్‌ను గమనించి గ్రామ పంచాయతీ ఆవరణలో పెట్టారు. దీంతో సాయిరాం, శిరీషలు మంగళవారం వేకువ జామున సుమారు 3.30 గంటల సమయంలో కమలాపూర్ గ్రామ శివారులోని స్మశాన వాటికకు కాలినడకన చేరుకున్నారు. అక్కడ వేపచెట్టుకు తమ వెంట తెచ్చుకున్న తాడుతో ముందుగా శిరీష ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తర్వాత సాయిరాం అదే చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు మృతుడి జేబులో ఉన్న సెల్‌ఫోన్ ద్వారా వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement