శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం | If law and order ignore | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం

Dec 28 2016 12:26 AM | Updated on Aug 14 2018 3:37 PM

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం డీఎస్పీ మల్లికార్జునవర్మతో కలిసి ఎస్పీ బుక్కరాయసముద్రం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు.

బుక్కరాయసముద్రం :

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం డీఎస్పీ మల్లికార్జునవర్మతో కలిసి ఎస్పీ బుక్కరాయసముద్రం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. మండల కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న సీసీ కెమెరాలను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ అనంతపురం

నగరంలో 250 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. నేరాలను తగ్గించేందుకు సాంకేతిక  పరిజ్ఞానం ఉపయోగంలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఫ్యాక‌్షన్‌ గొడవలకు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2017 సంవత్సరం ప్రారంభం నుంచి విప్లవాత్మకంగా నేరాలు తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌, ఎస్‌ఐ విశ్వనాథ్‌ చౌదరి, ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు హెడ్‌ కానిస్టేబుల్‌ లక్ష్మినారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement