రోడ్డు ప్రమాదంలో ట్రిపుల్‌ ఐటీ లెక‍్చరర్‌ దుర‍్మరణం | Idupulapaya IIIT lecturer killed in mishap | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ట్రిపుల్‌ ఐటీ లెక‍్చరర్‌ దుర‍్మరణం

Jan 8 2017 1:30 PM | Updated on Sep 5 2017 12:45 AM

వైఎస్సార్‌ జిల్లా వేంపల్లి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ లో పనిచేస్తున్న అకడమిక్ అసిస్టెంట్ లాల్ బహుదూర్ శాస్రీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

వేంపల్లి: వైఎస్సార్‌ జిల్లా వేంపల్లి ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ లో పనిచేస్తున్న అకడమిక్ అసిస్టెంట్ లాల్ బహుదూర్ శాస్రీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ సంఘటనలో ఇంగ్లీష్ మేటర్ వెంకటరమణ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వెంకటరమణను కడప రిమ‍్స్‌కు తరలించారు. లాల‍్బహుదూర్‌శాస్త్రీ, వెంకటరమణ ఇద‍్దరూ స‍్వంత పనుల నిమిత‍్తం శనివారం సాయంత్రం ఇడుపులపాయ నుంచి ద్విచక్రవాహనంలో కడపకు వెళ్లారు.

తిరుగుప్రయాణంలో అర‍్థరాత్రి సమయంలో చీమలపెంట వద‍్ద పంది అడ‍్డంగా రావడంతో ద‍్విచక్రవాహనం అదుపు తప్పి ఇద‍్దరూ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో లాల్ బహుదూర్ శాస్రీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. ఒంగోలు స‍్వస‍్థలం కాగా పులివెందులలో నివాసం ఉంటున్నారు. విధుల్లో చేరిన మూడు రోజులకే శాస్రీ మృతి చెందడంతో కుటుంబంలోను ట్రిపుల్ ఐటీ లో విషాదఛాయలు అలుముకున్నాయి. గాయపడిన వెంకటరమణ ది పీలేరు కాగా ట్రిపుల్ ఐటీ లో ఇంగ్లీష్ మేటర్ గా పని చేస‍్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement