సాదా బైనామా అర్హులను పకడ్బందీగా గుర్తించాలి | Identify qualified armored plain bainama | Sakshi
Sakshi News home page

సాదా బైనామా అర్హులను పకడ్బందీగా గుర్తించాలి

Aug 6 2016 10:30 PM | Updated on Sep 4 2017 8:09 AM

మాట్లాడుతున్న పీఓ రాజీవ్‌

మాట్లాడుతున్న పీఓ రాజీవ్‌

ప్రభుత్వం సాదాబైనామా ద్వారా రైతుల భూములను రిజిస్ట్రేషన్‌ చేయడానికి అర్హులను పకడ్బందీగా గుర్తించాలని ఐటీడీఏ పీఓ రాజీవ్‌ గాంధీ హన్మంతు అన్నారు.శనివారం సబ్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన భద్రాచలం, పాల్వంచ డివిజనల్‌లోనితహసీల్దార్,వీఆర్వోల అవగాహన సమావేశంలో పీఓ మాట్లాడారు.

 సాదా బైనామా అర్హులను పకడ్బందీగా గుర్తించాలి
Identify qualified armored plain bainama

సాదా బైనామా, అర్హులను, పకడ్బందీగా గుర్తించాలి



ఐటీడీఏ పీఓ రాజీవ్‌ గాంధీ హన్మంతు
భద్రాచలం :ప్రభుత్వం  సాదాబైనామా ద్వారా రైతుల భూములను రిజిస్ట్రేషన్‌  చేయడానికి అర్హులను పకడ్బందీగా గుర్తించాలని ఐటీడీఏ పీఓ రాజీవ్‌ గాంధీ హన్మంతు అన్నారు.శనివారం సబ్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన భద్రాచలం, పాల్వంచ డివిజనల్‌లోనితహసీల్దార్,వీఆర్వోల అవగాహన సమావేశంలో పీఓ మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా భూమి హక్కు పత్రాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నా  సన్న, చిన్న కారు రైతులకు సాదాబైనామాలు ఇవ్వడం కోసం చర్యలు  చేపట్టడం జరిగిందన్నారు. ఐదెకరాలలోపు భూమి ఉన్న పేద రైతులకు స్టాంపు ఫీజు లేకుండా ఉచితంగా సాదాబైనామాలు చేయనున్నట్లు తెలిపారు. 2014 జూన్‌ 2వ తేదీకి ముందు గిరిజనులే ,గిరిజనులకు  భూములు అమ్మిన, కొన్న చట్టం ప్రకారంగా పరిశీలించాలన్నారు.
రికార్డులను నిశితంగా పరిశీలించాలి..
 ఏజెన్సీలో పోడుభూములపై ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున క్షేత్రస్థాయిలో నిశితంగా రికార్డులు పరిశీలించి పూర్తి స్థాయిలో గిరిజన రైతులను గుర్తించాలన్నారు. క్షేత్ర స్థాయిలో వీఆర్వోలు విచారణ చేసేటప్పుడు తహసీల్దార్లు కూడా వెళ్లి దరఖాస్తుదారులు సాగులో ఉన్నారా లేదా అనేది మొదటిగా పరిశీలించాలన్నారు.
వారంలోపే విచారణ పూర్తి చేయాలి..
ఫారం 11,12ల ద్వారా నోటీసులు జారీ చేసేటప్పుడు సంతకం చేసి తప్పనిసరిగా తేదీ వేయాలని, వారం రోజులలో విచారణ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. దరఖాస్తుదారుడు స్థానికంగా లేనప్పుడు సంబంధించిన స్థలం వద్దనే నోటీస్‌ పెట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్ర స్ధాయిలో విచారణ చేసిన వివరాలను కంప్యూటర్‌లో ఆన్‌లైన్‌ చేయాలని వివరించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్‌ కోఆర్డినేటర్‌ రాజ్, రిటైర్డ్‌ డీఆర్‌ఓ రాజారావు, ప్రోగ్రామ్‌ మేనేజర్‌ ప్రభాకర్‌రావు, డి. రమేష్, భద్రాచలం, పాల్వంచ డివిజన్ల డీఏఓలు, రామకృష్ణ, స్వర్ణ, తహసీల్దార్లు, వీఆర్వోలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement