ఫైనల్లో కిన్‌వెన్‌ జెంగ్‌ | Chinese Star Qinwen Zheng Qualified For WTA Finals | Sakshi
Sakshi News home page

ఫైనల్లో కిన్‌వెన్‌ జెంగ్‌

Nov 9 2024 1:28 PM | Updated on Nov 9 2024 2:59 PM

Chinese Star Qinwen Zheng Qualified For WTA Finals

రియాద్‌: మహిళల టెన్నిస్‌ సంఘం ముగింపు టోర్నమెంట్‌ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో చైనా స్టార్‌ కిన్‌వెన్‌ 
జెంగ్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ కిన్‌వెన్‌ జెంగ్‌ 6–3, 7–5తో క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై గెలిచింది.

తాజా విజయంతో డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టోరీ్నలో 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన తొలి చైనా క్రీడాకారిణిగా జెంగ్‌ గుర్తింపు పొందింది. 2013లో నా లీ ఈ టోరీ్నలో ఫైనల్‌కు చేరుకొని సెరెనా విలియమ్స్‌ (అమెరికా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.

క్రెజికోవాతో గంటా 40 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో కిన్‌వెన్‌ తొమ్మిది ఏస్‌లు సంధించింది. క్రెజికోవా సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్‌ చేసింది. సబలెంకా (బెలారస్‌), కోకో గాఫ్‌ (అమెరికా) మధ్య రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌ విజేతతో నేడు జరిగే ఫైనల్లో జెంగ్‌ తలపడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement