breaking news
Qinwen Zheng
-
రెండేళ్ల తర్వాత...
బీజింగ్: సొంతగడ్డపై చైనా టెన్నిస్ స్టార్ కిన్వెన్ జెంగ్ సంచలనం సృష్టించింది. మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) చైనా ఓపెన్–1000 సిరీస్ టైటిల్‌ను కిన్వెన్ జెంగ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో రెండేళ్ల టైటిల్ నిరీక్షణకు ఆమె తెరదించింది. చివరిసారి 2024 అక్టోబరులో కిన్వెన్ టోక్యోలో పాన్ పసిఫిక్ ఓపెన్ టైటిల్ సాధించింది. ఆదివారం ముగిసిన చైనా ఓపెన్ టోర్నీ సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 54వ ర్యాంకర్ కిన్వెన్ 7–5, 6–4తో ఫ్రెంచ్ ఓపెన్ చాంపియిన్ మిరా ఆండ్రీవా (రష్యా)పై విజయం సాధించింది. తద్వారా ఈ టోర్నీలో టైటిల్ గెలిచిన తొలి చైనా ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. అంతేకాకుండా ‘వైల్డ్ కార్డు’తో ఈ టోర్నీలో బరిలోకి దిగి టైటిల్ గెలిచిన తొలి ప్లేయర్‌గానూ పారిస్ ఒలింపిక్స్ పసిడి పతక విజేత అయిన కిన్వెన్ రికార్డు నెలకొల్పింది. ఓవరాల్‌గా కిన్వెన్కిది ఆరో సింగిల్స్ టైటిల్‌కాగా... 1000 లెవెల్లో తొలి టైటిల్. విజేత హోదాలో కిన్‌వెన్‌కు 11,51,380 డాలర్ల (రూ. 11 కోట్ల 14 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
ఫైనల్లో కిన్వెన్ జెంగ్
రియాద్: మహిళల టెన్నిస్ సంఘం ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో చైనా స్టార్ కిన్వెన్ జెంగ్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ కిన్వెన్ జెంగ్ 6–3, 7–5తో క్రెజికోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది.తాజా విజయంతో డబ్ల్యూటీఏ ఫైనల్స్ టోరీ్నలో 11 ఏళ్ల తర్వాత ఫైనల్‌కు చేరిన తొలి చైనా క్రీడాకారిణిగా జెంగ్ గుర్తింపు పొందింది. 2013లో నా లీ ఈ టోరీ్నలో ఫైనల్‌కు చేరుకొని సెరెనా విలియమ్స్ (అమెరికా) చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.క్రెజికోవాతో గంటా 40 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో కిన్వెన్ తొమ్మిది ఏస్‌లు సంధించింది. క్రెజికోవా సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. సబలెంకా (బెలారస్), కోకో గాఫ్ (అమెరికా) మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో నేడు జరిగే ఫైనల్లో జెంగ్ తలపడుతుంది.


