స్వగ్రామంలో హోంమంత్రి | Home Minister Nayani Narsimha Reddy visits hometown | Sakshi
Sakshi News home page

స్వగ్రామంలో హోంమంత్రి

Feb 29 2016 3:40 PM | Updated on Sep 3 2017 6:42 PM

తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి సోమవారం తన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగుమ్మ గ్రామానికి విచ్చేశారు.

నల్లగొండః  తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి సోమవారం తన స్వగ్రామమైన నల్లగొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగుమ్మ గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రిని కలిసిన గ్రామస్తులు ఊర్లో కోతులు బెడద ఎక్కువగా ఉంటుందని విన్నవించారు.

అయితే మంత్రి గతంలో ఆర్డీఓ, ఎఫ్‌ఆర్వోలకు ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినా అధికారులు నిర్లక్ష్యం చేయడంతో గ్రామస్తులు ‘సాక్షి’ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన మంత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే అధికారులు కోతులను పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అనంతరం ఆసరా ఫించన్లు, కరువు నివారణ చర్యలపై మంత్రి అధికారులతో సమీక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement