హుస్నాబాద్‌రూరల్ : గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ప్రభుత్వం నిర్ణయించిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీపై హైకోర్టు స్టే విధించింది. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని వ్యతిరేకిస్తూ నిర్వాసితులు కుంట తిరుపతిరెడ్డి, గుర్రం రాజిరెడ్డి, బోయిని భాస్కర్, జి.మధుసూదన్, మామిడి రమేశ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీపై హైకోర్టు స్టే
Sep 30 2016 11:59 PM | Updated on Aug 31 2018 9:15 PM
హుస్నాబాద్‌రూరల్ : గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ప్రభుత్వం నిర్ణయించిన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీపై హైకోర్టు స్టే విధించింది. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని వ్యతిరేకిస్తూ నిర్వాసితులు కుంట తిరుపతిరెడ్డి, గుర్రం రాజిరెడ్డి, బోయిని భాస్కర్, జి.మధుసూదన్, మామిడి రమేశ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. భూ సేకరణ చేసి ఏడేళ్లు గడిచినా ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోవడం, పునరావాసం కల్పించకపోవడంతో నష్టపోయిన తమకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని కోరారు.
అంతకుముందు గురువారం మధ్యాహ్నం గుడాటిపల్లికి వచ్చిన ఎమ్మెల్యే ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద రూ.8లక్షల పరిహారం ఇస్తామని, కోర్టులో కేసు ఉపసంహరించుకోవాలని రైతులను కోరగా.. వారు అంగీకరించలేదు. భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Advertisement
Advertisement