breaking news
r&r package
-
నెల రోజుల్లో నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ
దేవీపట్నం: అర్హులైన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరికీ నెలరోజుల వ్యవధిలోనే గ్రామాల వారీగా ప్యాకేజీ సొమ్మును అందజేస్తామని ఆర్అండ్ఆర్ కమిషనర్ సి. శ్రీధర్ స్పష్టం చేశారు. గురువారం ఆయన పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ఒ.ఆనంద్‌తో కలసి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో పలు పునరావాస కాలనీలను సందర్శించారు. ఇందుకూరు పంచాయతీలో నిర్మించిన పెదభీంపల్లి3, ఇందుకూరు2, ముసుళ్లకుంట కాలనీలను సందర్శించారు. ఇళ్లు, మరుగుదొడ్లు, రహదారులు, డ్రెయిన్లు, పాఠశాల, అంగన్వాడీ, గ్రామసచివాలయం, తదితర ప్రభుత్వ భవనాల నిర్మాణాలను పరిశీలించారు. నిర్వాసితులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రాలు సమర్పించారు. కమిషనర్ మాట్లాడుతూ.. దాదాపు రూ.90 కోట్ల మేర బిల్లులు నిర్వాసితులకు అందాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు అనర్హుల జాబితాలో ఉన్నవారి వాస్తవాలను పరిశీలించి.. 10 రోజుల్లో ప్యాకేజీ పొందేందుకు అర్హులా కాదా అన్న విషయాన్ని స్పష్టం చేస్తామని తెలిపారు. అనంతరం కొండమొదలు పంచాయతీలోని కొంతమందికి గంగవరం మండలం నేలదోనెలపాడు వద్ద నిర్మించిన పునరావాస కాలనీని సందర్శించారు. -
పోలవరం పచ్చ రాబందులు
-
న్యాయం కావాలి
♦ పోలవరం నిర్వాసితుల వేడుకోలు ♦ మూడేళ్ల స్థానికత నిబంధనతో అవస్థలు ♦ వివాహిత మహిళల పేర్లు ప్యాకేజీ జాబితా నుంచి తొలగింపు ♦ అక్రమాలు జరిగాయని యువతుల ఆవేదన కొత్త భూసేకరణచట్టంలో ఉన్న మూడేళ్ల స్థానికత నిబంధన పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులలో వివాహమైన యువతుల పాలిట శాపంగా మారింది. పుట్టినప్పటి నుంచి గ్రామంలో ఉన్నా, 2006 సర్వేలో పేర్లు నమోదు అయినా,వివాహమైన యువతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వర్తింప చేయటం లేదు. పోలవరం : ఇటీవల రెవెన్యూ అధికారులు ముంపు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి ఆర్అండ్ఆర్ అబ్ధిదారుల పేర్లు చదివి వినిపించారు. జాబితాలో లేని వారి పేర్లు నమోదు చేసుకున్నారు. కానీ గ్రామసభల సమయానికి జాబితాలో నమోదు చేసి ఉన్న వివాహిత యువతుల పేర్లు మాత్రం జాబితాల నుంచి తొలగించారు. వీరంతా ప్యాకేజీ కోసం దరఖాస్తు చేసుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి తరలి వచ్చారు. గ్రామసభల నాటికి మూడేళ్ల ముందు నుంచి గ్రామంలో ఉండాలనేది నిబంధన అని, వివాహమైనందున వారు గ్రామంలో ఉండరు కాబట్టి, వారి పేర్లు తొలగించామని అధికారులు చెబుతున్నారు. 2006 నుంచి ప్యాకేజీ కోసం ఎదురు చూశామని, ఇటీవలే వివాహం చేశామని, తీరా వివాహమైనందున ఆర్అండ్ఆర్ జాబితా నుంచి తమ పిల్లల పేర్లు తొలగించారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1200 మంది 18యేళ్లు పైబడిన యువతులు ఉండగా, వీరిలో దాదాపు 200 మంది యువతులకు గత రెండు లేదా మూడేళ్లలోపు వివాహాలయ్యాయి. వీరంతా ఈ నిబంధన కారణంగా ప్యాకేజ్ నష్టపోతున్నారు. గ్రామ సభల సమయంలో తమకు ప్యాకేజ్ వస్తుందని అధికారులు చెప్పారని, ఇపుడు పేర్లు తొలగించారని వివాహిత యువతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివాహమైనప్పటికీ కొందరి పేర్లు జాబితాలో ఎలా వచ్చాయని ప్రశ్నిస్తున్నారు. కొందరి పేర్లు ఎలా వచ్చాయి నాకు వివాహమైంది. గ్రామసభల్లో ప్యాకేజ్ జాబితాలో నాపేరు చదివి విని పించారు. ఆ తరువాత అధికారులు నాపేరు జాబితా నుంచి తొలగించారు.వివాహమైనందున పేరు తొలగించామని చెబుతున్నారు. వివాహమైన కొందరి పేర్లు ప్యాకేజ్ జాబితాలో ఎలా వచ్చాయి. – మూలెం రాజకుమారి, మాదాపురం, పోలవరం మండలం నాపేరు తొలగించారు... మాది పైడాకులమామిడి గ్రామం. నాకు వివాహమైంది. గ్రామసభల్లో నాపేరు చదివి వినిపించారు. ఆ తరువాత జాబితా నుంచి నాపేరు తొలగించారు. వివాహమైనందున పేరు తొలగించామని చెబుతున్నారు. ఇది అన్యాయం. ఇక్కడ పుట్టి, పెరి గిన వారికి ప్యాకేజ్ లేకుండా చేస్తున్నారు. – కొవ్వాసు బుచ్చమ్మ, పైడాకులమామిడి, పోలవరం మండలం -
ఆర్అండ్ఆర్ ప్యాకేజీపై హైకోర్టు స్టే
హుస్నాబాద్‌రూరల్ : గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులకు ప్రభుత్వం నిర్ణయించిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీపై హైకోర్టు స్టే విధించింది. ఆర్అండ్ఆర్ ప్యాకేజీని వ్యతిరేకిస్తూ నిర్వాసితులు కుంట తిరుపతిరెడ్డి, గుర్రం రాజిరెడ్డి, బోయిని భాస్కర్, జి.మధుసూదన్, మామిడి రమేశ్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. భూ సేకరణ చేసి ఏడేళ్లు గడిచినా ప్రాజెక్టు పనులు పూర్తి చేయకపోవడం, పునరావాసం కల్పించకపోవడంతో నష్టపోయిన తమకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించి పునరావాసం కల్పించాలని కోరారు. అంతకుముందు గురువారం మధ్యాహ్నం గుడాటిపల్లికి వచ్చిన ఎమ్మెల్యే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.8లక్షల పరిహారం ఇస్తామని, కోర్టులో కేసు ఉపసంహరించుకోవాలని రైతులను కోరగా.. వారు అంగీకరించలేదు. భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.