హాయ్‌ రాజమండ్రి.. | HI RAJAHMUNDRY | Sakshi
Sakshi News home page

హాయ్‌ రాజమండ్రి..

Sep 25 2016 11:35 PM | Updated on Aug 17 2018 2:27 PM

హాయ్‌ రాజమండ్రి.. - Sakshi

హాయ్‌ రాజమండ్రి..

ప్రముఖ సినీ నటి రెజీనా కాసేండ్ర ఆదివారం రాజమహేంద్రవరంలో సందడి చేసింది. స్థానిక కోటిపల్లి బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన నీరూస్‌ షోరూమ్‌ను ఆమె ప్రారంభించింది. జ్యోతి ప్రజ్వలన చేసి, షోరూమ్‌లోని పలు కౌంటర్ల వద్ద ఉంచిన ప్రత్యేక డిజైనర్‌ చీరలను తిలకించింది. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, నగరంలో ఇది నీరూస్‌ మొదటి షోరూమ్‌ అని, దీనిని సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారని అన్నారు. మహిళలు, చిన్నారులకు కావలస

  • రాజమహేంద్రవరంలో రెజీనా సందడి
  •  
    దానవాయిపేట (రాజమహేంద్రవరం) :
    ప్రముఖ సినీ నటి రెజీనా కాసేండ్ర ఆదివారం రాజమహేంద్రవరంలో సందడి చేసింది. స్థానిక కోటిపల్లి బస్టాండ్‌ వద్ద ఏర్పాటు చేసిన నీరూస్‌ షోరూమ్‌ను ఆమె ప్రారంభించింది. జ్యోతి ప్రజ్వలన చేసి, షోరూమ్‌లోని పలు కౌంటర్ల వద్ద ఉంచిన ప్రత్యేక డిజైనర్‌ చీరలను తిలకించింది. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ, నగరంలో ఇది నీరూస్‌ మొదటి షోరూమ్‌ అని, దీనిని సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారని అన్నారు. మహిళలు, చిన్నారులకు కావలసిన అన్ని రకాల డిజైనర్‌ వస్త్రాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. త్వరలోనే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఏడు నూతన షోరూమ్‌లు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ఒకటి, తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ హరీష్‌కుమార్, డైరెక్టర్లు నీరూస్‌ కుమార్, అవినాష్‌కుమార్, సింగార్‌ సింధు, రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ఎం.రాజ్‌కిషోర్, కాంట్రాక్టర్‌ తోట సుబ్బారావు, వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్‌ పిల్లి నిర్మల తదితరులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement