పచ్చదనంతోనే ప్రగతి | greenari to progress | Sakshi
Sakshi News home page

పచ్చదనంతోనే ప్రగతి

Aug 3 2016 11:15 PM | Updated on Aug 21 2018 7:58 PM

పచ్చదనంతోనే ప్రగతి - Sakshi

పచ్చదనంతోనే ప్రగతి

పచ్చదనంతోనే ఏ సమాజమైనా ప్రగతి సాధిస్తుందని, ప్రస్తుతం కావల్సినవి కాంక్రీట్‌ జంగిల్స్‌ కావని, జంగిల్స్‌ అని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ జి. సుధీర్‌బాబు అన్నారు

  • l గంగదేవిపల్లికి రావడం అంటే టెంపుల్‌కు వచ్చినట్లు..
  • l హరితహారంలో 9.50 లక్షల మొక్కలు నాటాం 
  • l నగర పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు
  • గీసుకొండ : పచ్చదనంతోనే ఏ సమాజమైనా ప్రగతి సాధిస్తుందని, ప్రస్తుతం కావల్సినవి కాంక్రీట్‌ జంగిల్స్‌ కావని, జంగిల్స్‌ అని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ జి. సుధీర్‌బాబు అన్నారు.  హరితహారాన్ని ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమంలా చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మండలంలోని జాతీయ ఆదర్శగ్రామం గంగదేవిపల్లిలో పోలీసుల ఆ««దl్వర్యంలో బుధవారం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో మాట్లాడుతూ.. గంగదేవిపల్లికి రావడం అంటే దేవాలయానికి వచ్చినట్లుగా ఉంటుందని, ఇలాంటి గ్రామాన్ని హరితవనంగా తీర్చిదిద్దడానికి తొలుత 6 వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. పెంబర్తిని దత్తత తీసుకుని గంగదేవిపల్లిలా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. నీరు, చెట్లు సమృద్ధిగా ఉన్న చోటే గొప్ప నాగరికతలు  వర్ధిల్లాయని గుర్తుచేశారు. గత ఏడాది హరితహారంలో  1.10 లక్షల  మొక్కలు నాటితే,  ప్రజల భాగస్వామ్యంతో ఈ ఏడాది నగర కమిషనరేట్‌ పరిధిలో  9.50 లక్షల మొక్కలు నాటామన్నారు. మామునూరు ఎసీపీ మహేందర్‌ మాట్లాడుతూ చైనా, ఆఫ్రికా దేశాల తర్వాత ఇక్కడే పెద్ద స్థాయిలో హరితహారం కార్యక్రమం జరుగుతోందన్నారు. మామునూరు డివిజన్‌ పరిధిలో 3.50 లక్షల మెక్కలు నాటామన్నారు. అనంతరం గ్రామంలో 8 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాస్, ఎంపీపీ ముంత కళావతి, జెడ్పీటీసీ ఆంగోతు కవిత, ఎంపీడీఓ సాయిచరణ్, ఈవోపీఆర్‌డీ భీంరెడ్డి రవీంద్రారెడ్డి,  మామునూరు సీఐ శ్రీనివాస్, గీసుకొండ ఎస్‌ఐలు అంజన్‌రావు, నవీన్‌కుమార్, సర్పంచ్‌ ఇట్ల శాంతి, గ్రామాభివృద్ధి కమిటీ నాయకుడు కూసం రాజమౌళి , అరబిందో  ఫార్మసీ కాలేజి, ఉషోదయ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement