ప్రభుత్వం స్పందించకుంటే తిరుగుబాటు తప్పదు | govt have to respond on sc categorisation | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం స్పందించకుంటే తిరుగుబాటు తప్పదు

Sep 25 2016 11:28 PM | Updated on Sep 15 2018 3:07 PM

ఎస్సీ వర్గీకరణ పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్య ధోరణి వహిస్తోందని ఇలాగే కొనసాగితే మాదిగల తిరుగుబాటు తప్పదని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంఎస్‌ రాజు హెచ్చరించారు.

అనంతపురం న్యూటౌన్‌ : ఎస్సీ వర్గీకరణ పట్ల ప్రభుత్వం చాలా నిర్లక్ష్య ధోరణి వహిస్తోందని ఇలాగే కొనసాగితే మాదిగల తిరుగుబాటు తప్పదని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంఎస్‌ రాజు హెచ్చరించారు. ఆదివారం స్థానిక సంగమేష్‌ నగర్‌లోని సాయిబాబా కల్యాణ మండపంలో ఎమ్మార్పీఎస్‌ రాయలసీమ జిల్లాల ముఖ్యనేతల సమావేశం జరిగింది.

రాజు మాట్లాడుతూ  వర్గీకరణ కోసం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చేందుకు వచ్చేనెల 5న అమలాపురంలో మాదిగ ఆత్మగౌరవ సభను, 25న నెల్లూరులో మాదిగ యుద్ధ భేరి, నవంబరు 20న అమరావతిలో మాదిగల తిరుగుబాటు సభలు జరుగుతాయని,  అన్ని జిల్లాల నుండి కార్యకర్తలను తరలించేలా కషి చేయాలని  పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement