మెరుగైన సేవలందిస్తే జీవితాంతం ఆత్మసంతృప్తి | GOOD WORK ..LONG TIME HAPPYNES | Sakshi
Sakshi News home page

మెరుగైన సేవలందిస్తే జీవితాంతం ఆత్మసంతృప్తి

Jul 30 2016 10:27 PM | Updated on Mar 21 2019 8:35 PM

మెరుగైన సేవలందిస్తే జీవితాంతం ఆత్మసంతృప్తి - Sakshi

మెరుగైన సేవలందిస్తే జీవితాంతం ఆత్మసంతృప్తి

ఏ ఉద్యోగి అయినా మెరుగైన సేవలు అందిస్తే.. అలాంటివారు పదవీ విరమణ చేసినా లేదా వేరే ప్రాంతానికి బదిలీ అయినా ఆ సేవలు వారికి జీవితాంతం ఆత్మసంతృప్తిని కలిగిస్తాయని కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ అన్నారు. స్థానిక రెవెన్యూ అసోసియేషన్‌ భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా జిల్లా శాఖ ఆధ్వర్యాన ఇద్దరు సమాచార శాఖ ఉద్యోగులకు శనివారం ఆత్మీయ సత్కార వీడ్కోలు సభ జరిగింది.

కాకినాడ సిటీ :
ఏ ఉద్యోగి అయినా మెరుగైన సేవలు అందిస్తే.. అలాంటివారు పదవీ విరమణ చేసినా లేదా వేరే ప్రాంతానికి బదిలీ అయినా ఆ సేవలు వారికి జీవితాంతం ఆత్మసంతృప్తిని కలిగిస్తాయని కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ అన్నారు. స్థానిక రెవెన్యూ అసోసియేషన్‌ భవన్‌లో ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా జిల్లా శాఖ ఆధ్వర్యాన ఇద్దరు సమాచార శాఖ ఉద్యోగులకు శనివారం ఆత్మీయ సత్కార వీడ్కోలు సభ జరిగింది. సమాచార శాఖ రేడియో ఇంజనీరింగ్‌ విభాగంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇంజనీరుగా పనిచేస్తూ పదవీ విరమణ చేస్తున్న డీవీఎస్‌ రాజు, అలాగే జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో 20 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పని చేసి ఇటీవల బదిలీపై విజయవాడ వెళ్లిన కాకినాడ డివిజనల్‌ పౌర సంబంధాల అధికారి వి.రామాంజనేయులును సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ డీవీఎస్‌ రాజు, రామాంజనేయులు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎం.ఫ్రాన్సిస్, సీనియర్‌ పాత్రికేయుడు మధుసూదనరావు, ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు డీఎస్‌ఎస్‌ రామాంజనేయులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement