ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల (2016–17 విద్యా సంవత్సరానికి) పోస్టులను రెన్యూవల్ చేస్తూ ఆ శాఖ ఇన్‌చార్జ్ కమిషనర్ సంధ్యారాణి ఉత్తర్వులు జారీ చేశారు.
	– పోస్టుల రెన్యూవల్‌కు ఉత్తర్వులు జారీ
	
	అనంతపురం ఎడ్యుకేషన్ : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల  (2016–17 విద్యా సంవత్సరానికి) పోస్టులను రెన్యూవల్ చేస్తూ ఆ శాఖ ఇన్‌చార్జ్ కమిషనర్ సంధ్యారాణి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లాకు ఉత్తర్వులు అందాయి. జిల్లాలోని 41 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 427 మంది కాంట్రాక్ట్  లెక్చరర్లు పని చేస్తున్నారు.
	
	ఈ విద్యా సంవత్సరం జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి.  ఇప్పటి వరకూ ప్రభుత్వం అధికారికంగా రెన్యూవల్ చేయని కారణంగా వారికి జీతాలు రాలేదు. ఉత్తర్వుల జారీతో వారు ఊపిరిపీల్చుకున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
