'అలా పిలిస్తే.. మంత్రి అయినా శిక్షించాల్సిందే' | Gokaraju ganga raju slams tdp govt | Sakshi
Sakshi News home page

'అలా పిలిస్తే.. మంత్రి అయినా శిక్షించాల్సిందే'

Jun 30 2016 6:36 PM | Updated on Sep 4 2017 3:49 AM

'అలా పిలిస్తే.. మంత్రి అయినా శిక్షించాల్సిందే'

'అలా పిలిస్తే.. మంత్రి అయినా శిక్షించాల్సిందే'

పోలీసులను రేయ్ అని పిలవడం మంచిదికాదనీ, అలా పిలిస్తే మంత్రి అయినా సరే శిక్షించాల్సిందేనని బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు వ్యాఖ్యానించారు.

విజయవాడ: పోలీసులను రేయ్ అని పిలవడం మంచిదికాదనీ, అలా పిలిస్తే మంత్రి అయినా సరే శిక్షించాల్సిందేనని బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నోటీసులు ఇవ్వకుండా ఆలయాలు తొలగించడం సరికాదన్నారు. గతంలో ముస్లిం రాజులు ఏ విధంగా ఆలయాలు తొలగించారో.. ఇప్పుడు అదేవిధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీని వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పారు. దీనిని వ్యతిరేకించినవారిని బెదిరిస్తున్నారని అన్నారు. ప్రజాప్రతినిధులు బెదిరింపులకు పాల్పడడం సరికాదని గోకరాజు గంగ రాజు తెలిపారు.

ఇదిలా ఉండగా, గోదావరి పుష్కర పనుల్లో ప్రొక్లెయినర్ పెట్టి దేవుడి విగ్రహాలు తొలగించారని శివస్వామి ఆరోపించారు. అదే ప్రదేశంలో భక్తులు కూడా మృతిచెందినట్టు చెప్పారు. విజయవాడలో ఒక్క ఆలయం నుంచి ఒక ఇటుక తొలగించినా ఊరుకోమని అన్నారు. ఇప్పటివరకూ తొలగించిన ఆలయాలను అక్కడే నిర్మించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆలయాల కోసం తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధమని శివస్వామి స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement