మైలార్‌దేవిపల్లిలో బాలిక కిడ్నాప్ | Girl kidnapped at Milardevipally | Sakshi
Sakshi News home page

మైలార్‌దేవిపల్లిలో బాలిక కిడ్నాప్

Aug 21 2016 12:09 PM | Updated on Mar 28 2018 11:26 AM

మైలార్‌దేవిపల్లిలో బాలిక కిడ్నాప్ - Sakshi

మైలార్‌దేవిపల్లిలో బాలిక కిడ్నాప్

పాఠశాలకు వెళ్లిన బాలిక కిడ్నాప్ అయిన ఘటన మైలార్‌దేవిపల్లిలో చోటుచేసుకుంది.

రాజేంద్రనగర్: పాఠశాలకు వెళ్లిన బాలిక కిడ్నాప్ అయిన సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మైలార్‌దేవిపల్లిలో చోటుచేసుకుంది. స్థానిక సాయిబాబ నగర్‌కు చెందిన కీర్తీ(14) తొమ్మిదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పాఠశాలకు వెళ్లిన బాలిక తిరిగి ఇంటికి రాలేదు. అదే కాలనీకి చెందిన సంతోష్(19) బాలికను కిడ్నాప్ చేశాడని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement