కేజీబీవీలో గ్యాస్‌ పైపు లీక్‌ | gas leaked in kgbv | Sakshi
Sakshi News home page

కేజీబీవీలో గ్యాస్‌ పైపు లీక్‌

Aug 2 2016 11:03 PM | Updated on Sep 4 2017 7:30 AM

లీకయిన పైప్‌ను పరిశీలిస్తున్న ఎఎస్‌ఐ

లీకయిన పైప్‌ను పరిశీలిస్తున్న ఎఎస్‌ఐ

సీతంపేట కస్తూరిబా గాంధీ పాఠశాలలో మంగళవారం ఉదయం గ్యాస్‌పైపు లీకైంది. దీంతో మంటలు చేలరేగాయి. విద్యార్థినులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీనివాసరావు, ఏఎస్‌ఐ జగన్నాధరావు పాఠశాలకు చేరుకుని మంటలను అదుపు చేశారు

సీతంపేట : సీతంపేట కస్తూరిబా గాంధీ పాఠశాలలో మంగళవారం ఉదయం గ్యాస్‌పైపు లీకైంది. దీంతో మంటలు చేలరేగాయి. విద్యార్థినులు భయాందోళనతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ శ్రీనివాసరావు, ఏఎస్‌ఐ జగన్నాధరావు పాఠశాలకు చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యార్థినుల కోసం ఉదయం పూట రాగిజావ వండే సమయంలో పైపు లీకైంది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బాలికల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం కొండగొర్రె సుబ్బారావు పాలకొండ అగ్నిమాపక శకటానికి ఫోన్‌ చేశారు. శకటం వచ్చేసరికే మంటలను అదుపు చేశారు. ప్రమాదం తప్పడంతో ప్రత్యేకాధికారిణి రేవతితో పాటు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఐటీడీఏ, ఆర్‌వీఎంకు సమాచారం చేరవేశారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement