రూ.720 కోట్లతో పోషకాహారం
ఏలూరు (మెట్రో): రాష్ట్రంలో గర్భిణులు, బాలింతలకు, అంగన్‌వాడీ చిన్నారులకు రు.720 కోట్లతో పోషకాహారం అందించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, అర్హులకు పోషకాహారం అందించేందుకు ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శివపార్వతి చెప్పారు.
ఏలూరు (మెట్రో): రాష్ట్రంలో గర్భిణులు, బాలింతలకు, అంగన్‌వాడీ చిన్నారులకు రు.720 కోట్లతో పోషకాహారం అందించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, అర్హులకు పోషకాహారం అందించేందుకు ఆన్‌లైన్ విధానాన్ని అమలు చేస్తున్నామని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ శివపార్వతి చెప్పారు. బుధవారం ఏలూరులో ఐసీడీఎస్ సీడీపీవోలు, ఏపీడీలకు ఈ–పాస్ విధానం అమలుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఏడు నెలల నుంచి ఆరేళ్లలోపు 34.70 లక్షల మంది చిన్నారులకు రోజూ పోషకాహారం అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా సమర్థవంతంగా పోషకాహార పంపిణీకి అవగాహనా సదస్సులు ఉపయోగపడతాయని చెప్పారు. ఐసీడీఎస్ ఉప సంచాలకుడు ఆర్.సూయిజ్ మాట్లాడుతూ జిల్లాలో ఈ–పాస్ విధానంపై సరైన అవగాహన లేక సీడీపీవోలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్.చంద్రశేఖర్, అధికారులు పాల్గొన్నారు.