విజ్ఞానపదం | Fold artists performance | Sakshi
Sakshi News home page

విజ్ఞానపదం

Aug 4 2016 11:29 PM | Updated on Sep 4 2017 7:50 AM

విజ్ఞానపదం

విజ్ఞానపదం

పండగలొస్తే జానపదం ఘల్లుమంటుంది. ప్రతి గుండె ఝల్లుమంటుంది. పాటల వాన కురిసిపోతుంది. ప్రతి గడప పరవశించిపోతుంది. పల్లె జనం మురిసిపోతుంది. పూట గడవకపోయినా పాటతోనే ప్రయాణం సాగిపోతోంది. పైసలు రాలకపోయినా ప్రశంసలతో కడుపు నిండిపోతోంది.

200 మంది జానపద కళాకారుల అభిరుచి
ఇతర రాష్ట్రాల్లో ప్రదర్శనలకు ప్రశంసలు
ప్రభుత్వ పథకాలపై విస్తత ప్రచారం
పండగలు, సంబరాల్లో పల్లెల్లో ప్రదర్శనలు
 
 
సీతానగరం: పండగలొస్తే జానపదం ఘల్లుమంటుంది. ప్రతి గుండె ఝల్లుమంటుంది. పాటల వాన కురిసిపోతుంది. ప్రతి గడప పరవశించిపోతుంది. పల్లె జనం మురిసిపోతుంది. పూట గడవకపోయినా పాటతోనే ప్రయాణం సాగిపోతోంది. పైసలు రాలకపోయినా ప్రశంసలతో కడుపు నిండిపోతోంది. ప్రభుత్వాదరణ లేకపోయినా కళకే అంకితమవుతోంది. ఒకటా.. రెండా.. తప్పెటగుళ్లు, మరగాల నత్యం, కోలాటం, బిందెల నత్యం, చిడతలు.. ఒకరా.. ఇద్దరా 200 మంది కళాకారులు. సీతానగరం మండలానికి వన్నె తెచ్చారు. ఆధునిక ప్రపంచంలోనూ ఉనికి నిలబెట్టుకునేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. పుట్టినా.. గిట్టినా.. శుభకార్యాలు జరిగినా జానపద కళాకారులకు పిలుపు వస్తుంది. అమ్మవారి పండుగలు, ప్రజా ప్రతినిధుల ఊరేగింపు, సంబరాలు, పర్వదినాల్లో ఊపిరి సలపనంత డిమాండ్‌ ఉంటుంది. తప్పెటగుళ్ళు, మరగాలు, కోలాటలు, బిందెల నత్యం, చిడతలాటలు చూసి పల్లె జనం పరశించిపోతారు. రైతులు వరి ఆకు తీతలు, వరిఉభాలు, చెరకు జడల కట్టు, గోగు తీసే పనుల్లో నిమగ్నమైనప్పుడు కష్టం మరిచిపోయేందుకు.. మనోల్లాసం కలిగించేందుకు జానపద గీతాలు అలపిస్తారు. గ్రామాల్లో ఎవరింట్లోనైనా మతి చెందాక.. కొన్ని తరాలు గడిచాక ఎవరికీ గుర్తుండరు. కానీ బుడగ జంగాల కళాకారులకు వారంతా గుర్తుంటారు. గ్రామాల్లో ఇల్లిల్లూ తిరుగుతూ మూడుతరాల చిట్టాను పాటగా ఆలపిస్తారు. చిన్నారాయుడుపేట, చినంకలాం గ్రామాల్లో బుడగ జంగాల కుటుంబాలున్నాయి.
 
రాష్ట్రస్థాయిలో బిందెల నత్యానికి గుర్తింపు
 రామవరం గ్రామంలో శిక్షణ పొందిన బిందెల నత్యం కళాకారులు రాష్ట్రస్థాయి గుర్తింపు తెచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రచారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ తరపున విజయనగరం జిల్లా పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్, ఒడిశా, చత్తీస్‌ ఘడ్, ఉత్తరాంచల్, పంజాబ్‌ రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఏపీ, తెలంగాణా రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో కళాకారులు ప్రదర్శనలిచ్చి సత్కారాలు పొందారు.
 
ఏ గ్రామానికెళ్లినా కళాకారులే
 కొత్తవలస, బళ్లకష్ణాపురం, గెడ్డలుప్పి, గాదెవలస బూర్జ, లక్ష్మీపురం, ఏగోటివలస, పెదబోగిలి, పాపమ్మవలస గ్రామాల్లో యాదవ కులస్తులంతా తప్పిటగుళ్ళు జానపద కళాకారులే. యాదవ కులస్తులు ఆరాధ్య దైవంగా కొలిచే సింహాద్రప్పన్న,lఎల్లమ్మ తల్లి, దుర్గతల్లి, విఘ్నేశ్వరస్వామి, ఆంజనేయస్వామి పేరిట కూర్చిన పాటలతో జానపద కళాప్రదర్శనలు ఇస్తారు. రామవరం, బళ్లకష్ణాపురం, తామరకండి, కష్ణారాయపురం గ్రామాల్లో బిందెల నత్యం కళాకారులున్నారు. తామరకండి, బళ్లకష్ణాపురం గ్రామాల్లో భాగవతం, చిడతలు, కోలాటాలను ప్రదర్శించే కళాకారులున్నారు. తామరకండిలో వంశపారంపర్యంగా వత్తిని స్వీకరిస్తున్న జముకుల కళాకారులున్నారు. జమికల పరికరంతో వేసవిలో పనులు లేని సమయాల్లో రాత్రి పూట రామమందిరాలు, రచ్చబండల వద్ద ప్రదర్శనలు ఇవ్వడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచారం చేయడం, అంటువ్యాధుల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రదర్శనల రూపాల్లో ప్రజలకు పాటల రూపంలో విడమరిచి చెబుతారు. అందరినీ అలరించే ఈ కళాకారులు ఆర్థికంగా ఎదుగూబొదుగూ లేకపోవడమే పెద్ద విషాదం.
 
ప్రభుత్వాదరణ లేదు :అల్లు గంగులు, తప్పెటగుళ్ళ కళాకారుడు, గాదెలవలస
ఏటా సింహాద్రప్పన్న సన్నిధిలో కులవత్తికి మూలమైన తప్పిట గుళ్ల ప్రదర్శనలు ఇస్తాం. అనంతరం గ్రామాల్లో నిర్వహించే జాతర్లలో పాల్గొంటాం. మా కళను ప్రజలు ఆదరిస్తున్నా ప్రభుత్వ ఆదరణకు మాత్రం నోచుకోలేకపోయాం.
 
 
పింఛన్లకు అర్జీ పెట్టినా స్పందన లేదు:  బేత సత్యనారాయణ, అధ్యక్షుడు, సీతానగరం మండల కళాకారుల సంఘం
 హిందూ ధర్మ సంప్రదాయానికి అనుగుణంగా బిందెలు, నాగినీ నత్యంలో 200 మందికి శిక్షణ ఇచ్చాం. శిక్షణ పూర్తి చేసుకున్న  ప్రదర్శనలు ఇస్తున్న కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలి. నేను 26 ఏళ్ల క్రితం కళాకారుడిగా ప్రయాణం ప్రారంభించాను. బిందెలు, చిడతల నత్యం చేస్తాను. మా కళాకారుల పిల్లలకు బిందెలు, చిడతల నత్యంలో శిక్షణ ఇస్తున్నాను. ఎందరో సినీ దర్శకుల ప్రశంసలు పొందాను. మండలంలో అర్హులైన కళాకారులకు పింఛన్లు మంజూరు చేయమని 15 అర్జీలను అధికారులకు అందజేసినా ఇంతవరకూ స్పందించలేదు. కళాకారులకు పింఛన్ల మంజూరుపై ప్రభుత్వం శ్రద్ధ వహించాలి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement