ఏ నంబరూ మనుగడలో లేదు! | BSNL phones not working | Sakshi
Sakshi News home page

ఏ నంబరూ మనుగడలో లేదు!

Jul 29 2016 7:38 PM | Updated on Sep 4 2017 6:57 AM

ఏ నంబరూ మనుగడలో లేదు!

ఏ నంబరూ మనుగడలో లేదు!

మండలంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలీఫోన్‌ ఎక్సేS్చంజ్‌ పరిధిలోని ల్యాండ్‌లైన్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌ సర్వీసులు పనిచేయక వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ ప్రాంతానికి చెందినవారు ఎందరో ఉద్యోగాలు, చదువుల కోసం సుదూర ప్రాంతాల్లో ఉన్నారు. ల్యాండ్‌లైన్లు, నెట్‌ పనిచేయకపోవడంతో వారితో మాట్లాడాలన్నా, మెయిల్‌ పంపించాలన్నా వీలవక అవస్థలు పడుతున్నారు.

పనిచేయని బీఎస్‌ఎన్‌ఎల్‌ వ్యవస్థ
మొరాయిస్తున్న ల్యాండ్‌లైన్లు, నెట్‌ సర్వీసులు
బంధువుల క్షేమ సమాచారాలు తెలియక ఆందోళన
పడకేసిన మీసేవ కేంద్రాలు
 
సీతానగరం: మండలంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలీఫోన్‌ ఎక్సేS్చంజ్‌ పరిధిలోని ల్యాండ్‌లైన్లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌ సర్వీసులు పనిచేయక వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ ప్రాంతానికి చెందినవారు ఎందరో ఉద్యోగాలు, చదువుల కోసం సుదూర ప్రాంతాల్లో ఉన్నారు.  ల్యాండ్‌లైన్లు, నెట్‌ పనిచేయకపోవడంతో వారితో మాట్లాడాలన్నా, మెయిల్‌ పంపించాలన్నా వీలవక అవస్థలు పడుతున్నారు. రెండున్నర దశాబ్దాలుగా సుమారు 450 కుటుంబాలు దూర ప్రాంతాల్లోని తమ పిల్లల యోగ క్షేమాలను తెలుసుకునేందుకు, గృహావసరాలకు, 350 మంది వ్యాపార అవసరాలు, ప్రభుత్వ కార్యాలయాలు, అత్యవస సర్వీసుల కోసం మొత్తం 800 బీఎస్‌ఎన్‌ఎల్‌ కనెక్షన్లను ఏర్పాటు చేసుకుని వినియోగించేవారు. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ యాజమాన్యానికి ఆదాయం కూడా బాగుండేది. రెండేళ్లుగా బీఎస్‌ఎన్‌ఎల్‌ నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో విసుగెత్తిన వినియోగదారులు ఇతర సర్వీసుల వైపు మొగ్గు చూపిస్తున్నారు. ప్రస్తుతం 200 బీఎస్‌ఎన్‌ఎల్‌ సర్వీసులు మాత్రమే మండలంలో ఉన్నాయి. అవికూడా పది రోజులుగా పనిచేయకపోవడంతో వినియోగదారులు అసంతృప్తికి గురవుతున్నారు. పదిహేను రోజుల క్రితం పిడుగుపాటుతో ఎక్సేS్చంజ్‌ మూలకు చేరింది. మరమ్మతుల అనంతరం నాలుగు రోజులు పనిచేసింది. అప్పటినుంచి పది రోజులుగా పూర్తిగా మొరాయిస్తోంది.
 
సమాచారం తెలియడం లేదు: బి.శంకరరావు, గుచ్చిమి
మా ల్యాడ్‌ ఫోన్‌ నెలరోజులుగా పనిచేయడం లేదు. కుటుంబ సబ్యులంతా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఫోన్‌ పని చేయకపోవడంతో వారినుంచి సమాచారం అందక ఇబ్బంది పడుతున్నాం. తక్షణమే ల్యాడ్‌లైన్‌కు మరమ్మతులు చేయాలి.  
 
 
పనిచేయని మీ సేవ కేంద్రాలు: ఎన్‌ రామకృష్ణ, సీడీసీ చైర్మన్, బీకే పురం     
లచ్చయ్యపేట మీ సేవ కేంద్రంలో నెట్‌ సర్వీసు పనిచేయకపోవడంతో అవస్థలు పడుతున్నాను. తహసీల్దార్‌ కార్యలయం నుంచి వన్‌బి అవసర వచ్చింది. కానీ నెట్‌ పనిచేయకపోవడంతో వన్‌బీ లేక బ్యాంక్‌ వారు రుణాలు ఇవ్వడం లేదు. తక్షణమే మీ సేవ కేంద్రాల్లో నెట్‌ పనిచేసేలా బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు చర్యలు తీసుకోవాలి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement