'ఉప ఎన్నికలో మాకే విజయావకాశాలు' | errabelli dayakar rao comments on bypoll | Sakshi
Sakshi News home page

'ఉప ఎన్నికలో మాకే విజయావకాశాలు'

Published Sun, Oct 25 2015 3:47 PM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM

'ఉప ఎన్నికలో మాకే విజయావకాశాలు' - Sakshi

'ఉప ఎన్నికలో మాకే విజయావకాశాలు'

వరంగల్ లోక్‌సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికలో ఎన్డీయే తరఫు అభ్యర్థి ఎవరు అన్న అంశాన్ని మాత్రమే శనివారం జరిగిన సమావేశంలో చర్చించామని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.

హైదరాబాద్: వరంగల్ లోక్‌సభ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నికలో ఎన్డీయే తరఫు అభ్యర్థి ఎవరు అన్న అంశాన్ని మాత్రమే శనివారం జరిగిన సమావేశంలో చర్చించామని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఏ పార్టీ నుంచి అభ్యర్థిని దించాలనే అంశంపై మాట్లాడలేదని చెప్పారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ వరంగల్‌ ఉప ఎన్నికల్లో టీడీపీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.

వరంగల్ ఉప ఎన్నికల్లో మిత్రపక్షాలు బీజేపీ-టీడీపీ కలిసి పోటీచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలలో ఏ పార్టీ నుంచి అభ్యర్థిని పోటీకి దింపే విషయమై ఇరు పార్టీల నేతల మధ్య చర్చ జరుగుతున్నది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement