ఇంజనీరింగ్, డిప్లొమా విద్యార్థుల అప్రెంటిస్‌కు ఇంటర్వ్యూలు | Engineering, Diploma in Advertising from student interviews | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్, డిప్లొమా విద్యార్థుల అప్రెంటిస్‌కు ఇంటర్వ్యూలు

Nov 18 2015 12:08 AM | Updated on Jul 11 2019 6:33 PM

బోర్డు ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ సదరన్ రీజియన్ కమిటీ సహకారంతో తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో

ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహణ
 
 సాక్షి, హైదరాబాద్: బోర్డు ఆఫ్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ సదర న్ రీజియన్ కమిటీ సహకారంతో తెలంగాణ సాంకేతిక విద్యా శాఖ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లకు ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూలను ఈ నెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ డెరైక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. రామంతాపూర్‌లోని జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఈ ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. 2013, 2014, 2015 సంవత్సరాల్లో ఇంజనీరింగ్, డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వారు ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని వెల్లడించారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, బయోడేటా వివరాలతో ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4:30 గంటల మధ్య ఇంటర్వ్యూలకు రావాలని సూచించారు.

27వ తేదీన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్ ్స, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ) ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించారు. 28వ తేదీన ఈఈఈ, మెకానికల్, సివిల్, మెటలర్జీ ఇంజనీరింగ్, ఆటోమొబైల్, కెమికల్, మైనింగ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు, అలాగే డిప్లొమా అభ్యర్థులకు (ఈఈఈ, మెకానికల్, సివిల్, మెటలర్జీ, ఆటోమొబైల్, కెమికల్, ఈసీఈ, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మైనింగ్, డీసీసీపీ ) ఇంటర్వ్యూలు ఉంటాయని తెలిపారు.

వీటికి సంబంధించిన వివరాలను dte.telangana. gov.in/screens/notifications.aspxవెబ్‌సైట్‌లో పొందవచ్చని వివరించారు. వెబ్‌సైట్‌లో ఎన్‌టీఎస్‌ఈ, ఎన్‌ఎంఎంఎస్ కీ ఈ నెల 8వ తేదీన నిర్వహించిన నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఎన్‌టీఎస్‌ఈ), నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్షల ప్రాథమిక కీని విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సురేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ వరకు తమ అభ్యంతరాలనుdirgovexams.tg@gmail.comమెయిల్ ఐడీకి పంపించవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement