ఆదిలాబాద్ టౌన్ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని తెలంగాణచౌక్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఏబీవీపీ నిరసన
Aug 16 2016 11:17 PM | Updated on Sep 4 2017 9:31 AM
ఆదిలాబాద్ టౌన్ : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆదిలాబాద్ పట్టణంలోని తెలంగాణచౌక్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం జోనల్ ఇన్‌చార్జి ప్రశాంత్ మాట్లాడుతూ డిగ్రీలో ఆన్‌లైన్ విధానంపై విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల సీట్లు మిగిలిపోయాయన్నారు. దరఖాస్తు చేసుకోని విద్యార్థులకు నష్టం కలగకుండా స్పాట్ ఆడ్మిషన్లు నిర్వహించాలన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలన్నారు. వసతిగృహల్లో ఉంటున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ఎంసెట్–2 లీకు సంబంధించి సీబీఐ విచారణపై చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కర్ణద్వైత్, అనిల్, ప్రమోద్, నిఖిల్, శివ, శశికాంత్, అరుణ్, చందు, సుజత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement