కంకికో కవరు | each cover fo a single corn | Sakshi
Sakshi News home page

కంకికో కవరు

Aug 15 2016 10:56 PM | Updated on Sep 4 2017 9:24 AM

కంకికో కవరు

కంకికో కవరు

పక్షుల దాడి నుంచి రక్షించుకోవడానికి రైతులు సజ్జ కంకులకు కవర్లు కట్టారు. పుట్టపర్తి మండలంలోని అటవీ గ్రామాల్లో అధికంగా సజ్జ పంటను సాగు చేశారు.

పుట్టపర్తి అర్బన్‌ : పక్షుల దాడి నుంచి రక్షించుకోవడానికి రైతులు సజ్జ కంకులకు కవర్లు కట్టారు. పుట్టపర్తి మండలంలోని అటవీ గ్రామాల్లో అధికంగా సజ్జ పంటను సాగు చేశారు. సీడ్‌ కోసం ప్రత్యేకంగా మండలంలోని గంగిరెడ్డిపల్లి, దిగువచెర్లోపల్లి, సాతార్లపల్లి, గంగంపల్లి, గోపిదేవరపల్లి గ్రామాల్లో సజ్జ పంటను సాగు వేశారు.

అయితే  కాకులు, గువ్వలు, పిచ్చుకలు పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుండడంతో కవర్లు, దుస్తులు, టేపులు, శబ్దం కలిగించే వస్తువులు కట్టి పంటను రక్షంచుకుంటున్నామని రైతులు తెలిపారు. ఆ నాలుగు గ్రామాల్లో సుమారు 80 ఎకరాల్లో సజ్జ పంటను సాగు చేసినట్లు వారు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement