డీఆర్‌ఓ బాధ్యతల స్వీకరణ | DRO takes charge | Sakshi
Sakshi News home page

డీఆర్‌ఓ బాధ్యతల స్వీకరణ

Dec 10 2016 1:29 AM | Updated on Oct 20 2018 6:19 PM

డీఆర్‌ఓ బాధ్యతల స్వీకరణ - Sakshi

డీఆర్‌ఓ బాధ్యతల స్వీకరణ

నెల్లూరు (వేదాయపాళెం): నెల్లూరు డీఆర్‌ఓగా కృష్ణభారతి శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం డీఆర్‌ఓగా పనిచేస్తూ నాలుగు నెలల సెలవు అనంతరం ఆమె నెల్లూరుకు బదిలీ చేసిన విషయం విదితమే.

నెల్లూరు (వేదాయపాళెం):
నెల్లూరు డీఆర్‌ఓగా కృష్ణభారతి శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. శ్రీకాకుళం డీఆర్‌ఓగా పనిచేస్తూ నాలుగు నెలల సెలవు అనంతరం ఆమె నెల్లూరుకు బదిలీ చేసిన విషయం విదితమే. బాధ్యతలు చేపట్టిన అనంతరం కృష్ణభారతి మాట్లాడుతూ జిల్లాలో రెవెన్యూపరమైన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ముఖ్యంగా భూసమస్యల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ పదేపదే తిరిగే పరిస్థితి ఇక ఉండబోదన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement