ఆగని ఆందోళనలు | dont stop the agitations | Sakshi
Sakshi News home page

ఆగని ఆందోళనలు

Oct 6 2016 12:15 AM | Updated on Sep 4 2017 4:17 PM

ఆగని ఆందోళనలు

ఆగని ఆందోళనలు

వరంగల్‌ జిల్లాలోని పలు ప్రాంతాలకు తోడు పక్క జిల్లాల మండలాలను కలిపి ఐదు జిల్లాలుగా ఏర్పాటుచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయినా జిల్లాలో ఇంకా ఆందోళనలు ఆగడం లేదు. ములుగును జిల్లాగా ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో అక్కడి వివిధ సంఘాలు, పార్టీల నాయకులు బుధవారం భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించడంతో పాటు మేడారంలో సమ్మక్క తల్లి గద్దె వద్ద వినతిపత్రం సమర్పించారు.

వరంగల్‌ జిల్లాలోని పలు ప్రాంతాలకు తోడు పక్క జిల్లాల మండలాలను కలిపి ఐదు జిల్లాలుగా ఏర్పాటుచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయినా జిల్లాలో ఇంకా ఆందోళనలు ఆగడం లేదు. ములుగును జిల్లాగా ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌తో అక్కడి వివిధ సంఘాలు, పార్టీల నాయకులు బుధవారం భారీ ర్యాలీ, రాస్తారోకో నిర్వహించడంతో పాటు మేడారంలో సమ్మక్క తల్లి గద్దె వద్ద వినతిపత్రం సమర్పించారు. ఇక స్టేషన్‌ ఘన్‌పూర్‌, చిల్పూరు, జఫర్‌గఢ్‌ మండలాలను జనగామ జిల్లాలో చేర్చాలన్న ప్రతిపాదనలు వ్యతిరేకిస్తూ స్థానికులు బంద్‌, వంటావార్పుతో నిరసన తెలిపారు. అలాగే, గూడూరు మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేయాలని అక్కడి ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఈ మేరకు బుధవారం నర్సంపేటలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తదితరులను కలిసి వినతిపత్రాలు అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement