‘వైద్యులకు సెలవులు ఇవ్వొద్దు’ | dont sanction lives to doctors | Sakshi
Sakshi News home page

‘వైద్యులకు సెలవులు ఇవ్వొద్దు’

Sep 22 2016 12:18 AM | Updated on Sep 4 2017 2:24 PM

వైద్య ఆరోగ్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వెంకటరత్నం, ఆర్‌జేడీ దశరథ రామయ్యలు బుధవారం జిల్లాకు వచ్చారు.

అనంతపురం సిటీ:  వైద్య ఆరోగ్యశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ వెంకటరత్నం, ఆర్‌జేడీ దశరథ రామయ్యలు బుధవారం జిల్లాకు వచ్చారు. ముందుగా ప్రభుత్వాస్పత్రిలోని సూపరింటెండెంట్‌ జగన్నాథ్‌ను కలిసి వైద్య సేవల ందుతున్న తీరు.. మందుల కొరత తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వార్డులను  పరిశీలించారు.  సాయంత్రం జిల్లా వైద్యారోగ్యశాఖాధి కారి వెంకటరమణను కలిసి జిల్లా వ్యాప్తంగా డెంగీతో పాటు విష జ్వరాలకు సంబంధించిన వివరాలు సేకరించారు. జిల్లా వ్యాప్తంగా వైద్యారోగ్యశాఖలోని వైద్య బృందం, సిబ్బందిలో ఎవరికి సెలవులు ఇవ్వొద్దని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement