ఆందోళన వద్దు.. అందరికీ అక్రిడిటేషన్లు | Do not worry .. every one will got Accreditation | Sakshi
Sakshi News home page

ఆందోళన వద్దు.. అందరికీ అక్రిడిటేషన్లు

Jul 24 2016 10:07 PM | Updated on Oct 4 2018 8:34 PM

ప్రభుత్వం ఇంకా కుదట పడలేదని, అధికారుల లేమితోనే జర్నలిస్టుల అక్రిడిటేషన్లు, ఆరోగ్యకార్డులు ఆలస్యమవుతున్నాయని, త్వరలో అందరికీ అందుతాయని రాష్ట్ర ప్రెస్‌ అకాడమి చైర్మెన్‌ అల్లం నారాయణ అన్నారు. ప్రెస్‌ అకాడమి చైర్మెన్‌గా రెండోసారి నియమితులైన సందర్భంగా ఆదివారం హన్మకొండ ప్రెసక్లబ్‌లో టీయూడబ్ల్యూజే(హెచ్‌–143) ఆధ్వర్యంలో సన్మానించారు.

  • ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ
  • న్యూశాయంపేట : ప్రభుత్వం ఇంకా కుదట పడలేదని, అధికారుల లేమితోనే జర్నలిస్టుల అక్రిడిటేషన్లు, ఆరోగ్యకార్డులు ఆలస్యమవుతున్నాయని, త్వరలో అందరికీ అందుతాయని రాష్ట్ర ప్రెస్‌ అకాడమి చైర్మెన్‌ అల్లం నారాయణ అన్నారు. ప్రెస్‌ అకాడమి చైర్మెన్‌గా రెండోసారి నియమితులైన సందర్భంగా ఆదివారం హన్మకొండ ప్రెసక్లబ్‌లో టీయూడబ్ల్యూజే(హెచ్‌–143) ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పోరాటాల ఫలితంగానే అక్రిడిటేషన్ల కోసం ప్రభుత్వం జీవో జారీ చేసిందని, డెస్క్‌ జర్నలిస్టులకు కూడా ఇచ్చేలా జీవో జారీ అయిందని తెలిపారు.
     
    దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. 20 కోట్లతో జర్నలిస్టుల సంక్షేమ నిధిని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిందని, ఇది తమ సంఘ పోరాట ఫలితమేనని చెప్పారు. రూ.100 కోట్ల నిధిని సాధించి, ప్రతి జర్నలిస్టుకు రూ.10 వేల పెన్షన్‌ వచ్చేలా పోరాడుతానని అన్నారు. తన హయాంలో ప్రతిక్షణం జర్నలిస్టుల సంక్షేమానికే వెచ్చిస్తానన్నారు. జర్నలిస్టులకు ఆరోగ్యకార్డులు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల మంజూరుకు కృషి చేస్తాన ని హామీ ఇచ్చారు. తెలంగాణ సిలబస్‌ ప్రవేశపెట్టి అకాడమి ద్వారా జర్నలిస్టులకు శిక్షణ  శిబిరాలు నిర్వహిస్తామన్నారు. అంతకు ముందు ప్రెస్‌క్లబ్‌ ఆవరణలో  మొక్కలు నాటారు. కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర నాయకులు క్రాంతి, పి.రవి, లెనిన్, కొండల్‌రావు, పి.శివకుమార్, ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తి, జిల్లా అద్యక్షుడు జి.వెంకట్‌ పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement