అధ్యక్షునిగా శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి,
ప్రధాన కార్యదర్శిగా రమేశ్ వరికుప్పల
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ (సోమాజిగూడ) ఎన్నికల్లో ఫ్రెండ్స్ ప్యానల్ ‘విజయ’దుందుభి మోగించింది. ఆదివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఓ టింగ్ జరగ్గా, మొత్తం 1280 ఓట్లకు..1093 ఓట్లు పోలయ్యాయి. 17 పోస్టుల్లో..అత్యధిక పోస్టులను ఫ్రెండ్స్ ప్యానల్ కైవసం చేసుకుంది. అధ్యక్షునిగా శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి (సాక్షి) రెండోసారి భారీ ఆధిక్యతతో విజయం సాధించగా, ప్రధాన కార్యదర్శిగా రమే శ్ వరికుప్పల (ఈనాడు), కోశాధికారిగా రమేశ్ వైట్ల (ఎన్‌టీవీ) గెలుపొందారు.
ఉపాధ్యక్షునిగా ఎ.రాజేశ్, ఉపాధ్యక్షురాలిగా అరుణ అత్తలూరి, సంయుక్త కార్యదర్శులుగా చిలుకూరి హరిప్రసాద్, వి.బాపురావు గెలుపొందారు. మహిళా కార్యవర్గ సభ్యురాలిగా కల్యాణం రాజేశ్వరి, ఎన్.ఉమాదేవి విజయం సాధించారు. జనరల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు గా మర్యాద రమాదేవి, శంకర్‌సింగా, ఎన్.శ్రీనివాసరెడ్డి, నాగరాజు వనం, కస్తూరి శ్రీనివాస్, రచన, డి.అశోక్ విజయం సాధించారు. ఇదిలా ఉంటే ఫ్రెండ్స్ ప్యానల్‌కు చెందిన ఎదంవీవీ సత్యనారాయణ, అమిత్ భట్టుకు సమాన ఓట్లు రావడంతో టై ఏర్పడింది. వీరు ఈసీ మెంబర్‌లుగా పోటీపడ్డారు.


