హాకీ జిల్లా స్థాయి సీనియర్‌ జట్టు ఎంపిక | district level senior hockey team select | Sakshi
Sakshi News home page

హాకీ జిల్లా స్థాయి సీనియర్‌ జట్టు ఎంపిక

Jan 25 2017 11:07 PM | Updated on Sep 5 2017 2:06 AM

హాకీ జిల్లా స్థాయి సీనియర్‌ జట్టు ఎంపిక

హాకీ జిల్లా స్థాయి సీనియర్‌ జట్టు ఎంపిక

హాకీ జిల్లా స్థాయి సీనియర్‌ జట్టును బుధవారం ఎంపిక చేసినట్లు హాకీ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి విజయ్‌బాబు తెలిపారు.

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : హాకీ జిల్లా స్థాయి సీనియర్‌ జట్టును బుధవారం ఎంపిక చేసినట్లు హాకీ అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి విజయ్‌బాబు తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 28 నుంచి 31 వరకు విశాఖపట్టణంలో జరిగే సీనియర్‌ రాష్ట్ర చాంపియన్‌షిప్‌ టోర్నీలో పాల్గొంటారన్నారు. క్రీడాకారులకు అనంత క్రీడా గ్రామంలో ఆర్డీటీ సహకారంతో డచ్‌ శిక్షకులతో తర్ఫీదు ఇచ్చినట్లు వివరించారు. శిక్షణ ముగింపు శిబిరానికి డచ్‌ హాకీ క్రీడాకారులు కొస్పల్, రోడ్రిక్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతి క్రీడాకారుడు తన ఫిట్‌నెస్‌ను నిలుపుకునేందుకు కృషి చేయాలని సూచించారు. అప్పుడే రాణించగలరన్నారు. జట్టుకు కోచ్‌గా బాబయ్య, మేనేజర్‌గా ఓబులేసు వ్యవహరిస్తారు.

ఎంపికైన క్రీడాకారులు వీరే
గంగాధర్, హరీశ్‌, ఎర్రిస్వామి, లోక్‌నాథ్, శివానందరెడ్డి, అమర్, శివ, సాయికిరణ్, మహబూబ్‌బాషా, అక్రంబాషా, బాబ్జాన్‌, భగత్‌ బాబు, వెంకటేశ్‌, హర్షవర్దన్, నల్లప్పరెడ్డి, సంతోశ్‌, మహబూబ్‌బాషా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement