వర్ల రామయ్యా.. వర్గ రామయ్యా..? | Differences in TDP | Sakshi
Sakshi News home page

వర్ల రామయ్యా.. వర్గ రామయ్యా..?

Apr 19 2016 2:02 AM | Updated on Aug 10 2018 8:16 PM

వర్ల రామయ్యా.. వర్గ రామయ్యా..? - Sakshi

వర్ల రామయ్యా.. వర్గ రామయ్యా..?

టీడీపీలో గ్రూపులను పెంచి పోషిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు, విధానాలకు పామర్రు ....

ఉవల్లూరుపాలెం టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
రామయ్య తీరుపై నేతల ఫైర్
సీఎంకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక

 

 వల్లూరుపాలెం(తోట్లవల్లూరు) : టీడీపీలో గ్రూపులను పెంచి పోషిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు, విధానాలకు పామర్రు నియోజకవర్గం ఇన్‌చార్జి వర్ల రామయ్య తూట్లు పొడుస్తున్నారని ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రామయ్య నుంచి పార్టీని కాపాడేందుకు, అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేం దుకు అవసరమైతే సీఎంను కలవడంతోపాటు ఆందోళనకు వెనుకాడేదిలేదని వారు హెచ్చరించారు. మండలంలోని వల్లూరుపాలెంలో టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్, మండల జన్మభూమి కమిటీ సభ్యుడు చెన్నుపాటి పూర్ణచంద్రరావు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పక్కా గృహాల మంజూరు కోసం సర్పంచ్, ఎంపీటీసీ, జన్మభూమి కమిటీ సభ్యులు, అధికారులు కలిసి జాబితా రూపొందిస్తే కాదని, ఒకే ఒక వ్యక్తి సంతకంతో ఉన్న జాబితా ఆమోదం పొందుతుండటం హాస్యాస్పదమన్నారు.


గ్రామగ్రామాన రామయ్య గ్రూపులను ప్రోత్సహిస్తుండటంతో అధికారపక్షంలోనే పోరాటం చేయాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు చెన్నుపాటి స్వరూపరాణి మాట్లాడుతూ చంద్రబాబు స్ఫూర్తికి విరుద్ధంగా రామయ్య వ్యవహరిస్తున్నారన్నారు. పీఏసీఏస్ అధ్యక్షుడు ఆచంట కోటేశ్వరరావు(కోటిబాబు) మాట్లాడుతూ వర్ల రామయ్య కాస్తా వర్గ రామయ్యగా మారారని ఆరోపించారు. గ్రామ టీడీపీ అధ్యక్షుడు మిక్కిలినేని పాండురంగారావు, మాజీ అధ్యక్షుడు అరవపల్లి వెంకట మోహన్‌రావు, చిట్టిబొమ్మ శివరావు, చిగురుపాటి కృష్ణమూర్తి, బడుగు వెంకటేశ్వరమ్మ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement