భక్తులతో పోటెత్తిన కసాపురం | devotees flow in kasapuram | Sakshi
Sakshi News home page

భక్తులతో పోటెత్తిన కసాపురం

Aug 28 2016 12:51 AM | Updated on Jun 2 2018 8:47 PM

భక్తులతో పోటెత్తిన కసాపురం - Sakshi

భక్తులతో పోటెత్తిన కసాపురం

శ్రావణమాసం నాల్గవ శనివారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో పోటెత్తింది.

గుంతకల్లు రూరల్‌ : శ్రావణమాసం నాల్గవ శనివారం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి దేవస్థానం వేలాదిగా తరలివచ్చిన  భక్తులతో పోటెత్తింది. రాత్రి 8 గంటలకు ఆంజనేయస్వామి  ఉత్సవమూర్తిని ఒంటెవాహనంపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ ఈఓ ముత్యాలరావు ,ఆలయ అణువంశిక ధర్మకర్త సగుణమ్మల ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాకారోత్సవం నిర్వహించారు.

బళ్లారి మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖర్‌రెడ్డి సౌజన్యంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులకు చెక్కెర పొంగళి ,పులిహోర ప్రసాదాలు పంపిణీ చేశారు. నిత్యాన్నదాన సత్రంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ ఏఈఓ మధు , సూపరింటెండెంట్‌ వెంకటేశులు ఇతర అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement