రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి దుర్మరణం | Degree student killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి దుర్మరణం

Aug 5 2016 8:41 PM | Updated on Aug 30 2018 4:07 PM

డీసిఎంను ఓవర్‌టేక్ చేయబోయి ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పేట్‌బషీర్‌బాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

డీసిఎంను ఓవర్‌టేక్ చేయబోయి ఓ ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన పేట్‌బషీర్‌బాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్లు కథనం ప్రకారం మెదక్ జిల్లా అన్నారం గ్రామానికి చెందిన మామిడి ఛంద్రశేఖర్, స్వరూపారాణిలు గత కొంత కాలంగా మేడ్చల్ మండలం కండ్లకోయలో నివసిస్తున్నారు.

 

వీరి కుమారుడు మామిడి సంతోష్‌కుమార్(20) డిగ్రి చదువుతూ స్థానికంగా ఉన్న రిలయన్స్ గోడౌన్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. శుక్రవారం తన ద్వచక్రవాహనంపై బట్టలు కుట్టించేందుకు బహుదూర్‌పల్లిలోని ఇందిరమ్మ కాలనీకి వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు. మైసమ్మగూడ చౌరస్తాకు రాగానే జీడిమెట్ల నుండి వరంగల్‌కు వెళ్తున్న డిసీఎంను ఓవర్‌టేక్ చేయబోయి డిసీఎం వెనుక చక్రాల కింద పడి పోయాడు. సంతోష్ మెదడు చిట్లి పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహన్ని గాందీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement