'అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తారా' | damodar raja narsimha questioned kcr on corruption issue | Sakshi
Sakshi News home page

'అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తారా'

Nov 18 2015 2:31 PM | Updated on Mar 9 2019 3:34 PM

'అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తారా' - Sakshi

'అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తారా'

దళిత ఉపముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి, వరంగల్ లోక్సభకు ఉప ఎన్నిక తెచ్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ది అని కాంగ్రెస్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు.

వరంగల్ : దళిత ఉపముఖ్యమంత్రిని బర్తరఫ్ చేసి, వరంగల్ లోక్సభకు ఉప ఎన్నిక తెచ్చిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ది అని కాంగ్రెస్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్య పోకడలే లేవంటూ ఆయన మండిపడ్డారు. అసాధ్యపు హామీలు ఇచ్చి ప్రజలను ఆగం చేసింది కేసీఆర్ అని పేర్కొన్నారు. రూ.18 వేల కోట్ల రుణాలు మాఫీ చేయని సీఎం, రూ.40 వేల కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారో తెలపాలన్నారు.

వాటర్ గ్రిడ్ పథకంలో ఇప్పటికే రెండు వేల కోట్ల అవినీతి జరిగిందని, దాన్ని నిరూపిస్తే సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తారా అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. నిరూపించకపోతే మేం రాజకీయాల నుంచి తప్పుకుంటామని మాజీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యానించారు. వంచన, మోసం, దగా అనే సిద్ధాంతాలతో కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని, కేసీఆర్ నియంత అని, మాట, మూట, వేట అనేవి ఆయన విధానాలని దామోదర రాజనర్సింహ విమర్శలు గుప్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement