పటిష్టంగా సీపీవో వ్యవస్థ : డీఐజీ రామకృష్ణ | cpo system must strong | Sakshi
Sakshi News home page

పటిష్టంగా సీపీవో వ్యవస్థ : డీఐజీ రామకృష్ణ

Feb 27 2017 1:14 AM | Updated on Sep 5 2017 4:41 AM

పటిష్టంగా సీపీవో వ్యవస్థ : డీఐజీ రామకృష్ణ

పటిష్టంగా సీపీవో వ్యవస్థ : డీఐజీ రామకృష్ణ

జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్‌ అ«ధికారుల (సీపీవో) వ్యవస్థను పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని డీఐజీ పీఎస్‌వీ రామకృష్ణ తెలిపారు.

కొవ్వూరు : జిల్లాలో కమ్యూనిటీ పోలీసింగ్‌ అ«ధికారుల (సీపీవో) వ్యవస్థను పటిష్టంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని డీఐజీ పీఎస్‌వీ రామకృష్ణ తెలిపారు. పట్టణంలో రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో ఆదివారం ఆయన రికార్డులు పరిశీలించారు. పట్టణం, రూరల్‌ సర్కిళ్ల పరిధిలో కేసుల పురోగతిపై ఆరా తీశారు. అనంతరం డీఐజీ రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ నిస్వార్థంగా పోలీసు సేవలందించాలనుకునే వారు సీపీవోలుగా చేరవచ్చని సూచించారు. క్షుణ్ణం జాతీయ రహదారులపై ప్రమాదాల సంఖ్య తగ్గించేందుకు జిల్లాకు అదనంగా 13 పెట్రోలింగ్‌ వాహనాలు కేటాయించారని, నెల రోజుల్లో జిల్లాకు వస్తాయని తెలిపారు. జాతీయ రహదారి వెంబడి ఉన్న 13 స్టేషన్లకు పె ట్రోలింగ్‌ వాహనాలు కేటాయిస్తామన్నారు. ప్రమాదాలు సంభవించే ప్రాంతాలను జోన్‌లుగా విభజించి ఆయా ప్రాంతాలకు చెందిన ఎస్సై, సీఐ, డీఎస్పీలకు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు, సీఐలు ఎం.సుబ్బారావు, పి.ప్రసాదరావు, ఎస్సైలు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement