తెలంగాణ స్వాతంత్య్రాన్ని మరుస్తున్న సర్కార్‌ | cpi yatra come to Karimnagar | Sakshi
Sakshi News home page

తెలంగాణ స్వాతంత్య్రాన్ని మరుస్తున్న సర్కార్‌

Sep 15 2016 12:00 AM | Updated on Sep 4 2017 1:29 PM

తెలంగాణ స్వాతంత్య్రాన్ని మరుస్తున్న సర్కార్‌

తెలంగాణ స్వాతంత్య్రాన్ని మరుస్తున్న సర్కార్‌

తెలంగాణ రైతాంగసాయుధ పోరాటంతో వచ్చిన తెలంగాణ స్వాతంత్య్ర దినం సెప్టెంబర్‌ 17ను కేసీఆర్‌ సర్కార్‌ పూర్తిగా విస్మరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని నల్గొండలో ప్రారంభమైన బస్సుయాత్ర బుధవారం కరీంనగర్‌కు చేరుకుంది.

  • సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
  •  కరీంనగర్‌ : తెలంగాణ రైతాంగసాయుధ పోరాటంతో వచ్చిన తెలంగాణ స్వాతంత్య్ర దినం సెప్టెంబర్‌ 17ను కేసీఆర్‌ సర్కార్‌ పూర్తిగా విస్మరిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని నల్గొండలో ప్రారంభమైన బస్సుయాత్ర బుధవారం కరీంనగర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా తెలంగాణసాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. అక్కడినుంచి బైక్‌ర్యాలీగా అనభేరి విగ్రహం వరకు బయలుదేరారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో చాడవెంకటరెడ్డి మాట్లాడారు. నిజాం రాచరిక వ్యవస్థ కూలదోసి స్వాతంత్య్రాన్ని పొందడానికి నాడు బద్దం ఎల్లారెడ్డి, మఖ్దుం మెుయినొద్దీన్, రావినారాయణరెడ్డి తెలంగాణసాయుధ పోరాటానికి పిలుపునిచ్చారన్నారు. దీంతో గ్రామగ్రామాన ప్రజలు ఎర్రజెండాలు పట్టుకుని సాయుధ పోరాటంలో ముందుకు సాగారని పేర్కొన్నారు. జిల్లాలో బద్దం ఎల్లారెడ్డి, అనభేరి ప్రభాకర్‌రావు, సింగిరెడ్డి భూపతిరెడ్డి వంటి విప్లవవీరులు పోరాటంలో పాల్గొని ప్రజల్ని ఉద్యమంవైపు నడిపించారన్నారు. సెప్టెంబర్‌ 17ను అధికారికంగా నిర్వహించాలని చెప్పిన కేసీఆర్‌ అధికారంలోకి రాగానే విస్మరించడం సిగ్గుచేటని విమర్శించారు. చరిత్రను వక్రీకరిస్తూ బీజేపీ తిరంగాయాత్ర పేరుతో హంగామా చేస్తూ ప్రజలను నమ్మించడానికి  ప్రయత్నిస్తోందని అన్నారు. ఈ నెల 17న హైదరాబాద్‌లో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్య పద్మ, మహిళా సమాఖ్య, ఏఐఎస్‌ఎఫ్‌ కార్యదర్శి ఎన్‌.జ్యోతి, రావి శివరామకష్ణ, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాములు, నాయకులు పల్లె నర్సింహ, ఉప్పలయ్య, మారుపాక అనిల్, అంజయ్య, పైడిపల్లి రాజు, కసిరెడ్డి మణికంఠరెడ్డి, కాల్వనర్సయ్య, పంజాల శ్రీనివాస్, ముల్కల మల్లేశం, టేకుమల్ల సమ్మయ్య, బోయిని అశోక్, పొనుగంటి  కేదారి, అందెస్వామి, సృజన్‌కుమార్, గడిపె మల్లేష్‌ పాల్గొన్నారు.
     
     
     
     
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement