కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆధ్వర్యంలో ఆదివారం నుంచి సామాజిక న్యాయ సాధికారత బస్సు ....
వైజాగ్ నుంచి క ర్నూలు వరకు 13 జిల్లాల్లో బహిరంగ సభలు
ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు వినయ్‌కుమార్
విజయవాడ సెంట్రల్: కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆధ్వర్యంలో ఆదివారం నుంచి సామాజిక న్యాయ సాధికారత బస్సు యాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వినయ్‌కుమార్ తెలిపారు. ఆంధ్రరత్న భవన్‌లో శనివారం పోస్టర్లు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రారంభించనున్నట్లు చెప్పారు. 13 జిల్లాల్లో బస్సుయాత్ర సాగుతుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 6న కర్నూలులో ముగింపు సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ టీడీపీ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తోందన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల్ని కాలరాస్తోందని వాపోయారు. ప్రతి జిల్లాలో కనీసం రెండు బహిరంగ సభలు నిర్వహించే విధంగా ప్రణాళికరూపొందించామన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న గుంటూరులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏపీసీసీ అధికార ప్రతినిధులు కొలనుకొండ శివాజీ, మీసాల రాజేశ్వరరావు, ప్రధాన కార్యరద్శి నరహరిశెట్టి నరసింహారావు, గుంటూరు జిల్లా నాయకుడు లింగంశెట్టి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు