రాజవొమ్మంగి మండలంలో శనివారం మరో శిశు మరణం వెలుగు చూసింది. దీంతో ఈ ప్రాంతంలో శిశువుల మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మండలంలోని చికిలింత పంచాయతీ దుర్గానగర్‌లో రెండు నెలల పసికందు గురువారం కాకినాడ జీజీహెచ్‌లో మరణించగా శనివారం సాయంకాలం వెలుగు చూసింది. దుర్గానగర్ శివారు చేనుమఖాల్లో నివాసం ఉంటున్న కొచ్చ శ్రీలక్ష్మికి జడ్డంగి పీహెచ్‌సీలో తొలికాన్పులో
-
వెలుగు చూసిన మరో శిశువు మృతి
-
ఐదుకు చేరిన మృతులు
రాజవొమ్మంగి మండలంలో శనివారం మరో శిశు మరణం వెలుగు చూసింది. దీంతో ఈ ప్రాంతంలో శిశువుల మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మండలంలోని చికిలింత పంచాయతీ దుర్గానగర్‌లో రెండు నెలల పసికందు గురువారం కాకినాడ జీజీహెచ్‌లో మరణించగా శనివారం సాయంకాలం వెలుగు చూసింది. దుర్గానగర్ శివారు చేనుమఖాల్లో నివాసం ఉంటున్న కొచ్చ శ్రీలక్ష్మికి జడ్డంగి పీహెచ్‌సీలో తొలికాన్పులో మగబిడ్డ పుట్టాడు. మూడు రోజుల కిందట ఆ బిడ్డకు ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో కాకినాడ జీజీహెచ్‌లో బుధవారం చేర్పించగా చికిత్సపొందుతూ మరణించాడు.
– రాజవొమ్మంగి